Site icon NTV Telugu

Unstoppable 2: డార్లింగ్ తో బాలయ్య సందడి.. ఎట్టకేలకు ప్రోమో వచ్చేసిందోచ్

Nbk

Nbk

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కోసం అంతకుముందు ఎవరు ఎంతగా వెయిట్ చేశారో తెలియదు కానీ.. ప్రభాస్, పవన్ ఈ షోకు గెస్టులుగా వస్తున్నారని తెలియడంతో మాత్రం అందరు ఈ షో కోసం ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఆహా మేకర్స్ సైతం అభిమానుల ఆతృతను అర్ధం చేసుకొని చిన్న చిన్న క్లిప్స్ తో డార్లింగ్ ఎపిసోడ్ ను రివీల్ చేసి ఇప్పటివరకు ఆనందపరిచారు. కాగా, ఎట్టకేలకు ప్రభాస్ ప్రోమోను రిలీజ్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. డార్లింగ్ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలు గా మారిపోతాయి” అని బాలయ్య డైలాగ్ తో ప్రోమో మొదలై.. నేను నీ మాయలో పడిపోయాను అని బాలయ్య చేతే అనిపించాడు ప్రభాస్. ఇక ప్రభాస్ నవ్వుకు ఫిదా కానీ వారుంటారా అన్నట్లు ప్రోమో మొత్తంలో ప్రభాస్ నవ్వులు చూపించేశారు.

ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి గురించి అడిగేశాడు బాలయ్య.. ఏంటి అసలు పెళ్లి చేసుకుంటావా.. అని అడుగగా.. డార్లింగ్ .. ఏమో రాసి పెట్టిలేదేమో అని రాధేశ్యామ్ డైలాగ్ కొట్టేశాడు. ఇక్కడ నీ పప్పులేం ఉడకవు అన్నట్లు బాలయ్య మీ అమ్మకు చెప్పిన మాటలు చెప్పకు అంటూ సెటైర్ వేసేశాడు. ఆ తరువాత గర్ల్ ఫ్రెండ్స్ నిన్నేం పిలుస్తారు అంటూ బాలయ్య కొంటెగా అడిగినా డార్లింగ్ మాత్రం ఆ సీక్రెట్ ను రివీల్ చేయనున్నట్లు చెప్పుకొచ్చేశాడు. ఇక అంతలోనే గోపీచంద్ రావడం.. ఒక హీరోయిన్ గురించి అడగడం.. డార్లింగ్, గోపీచంద్ ను ఆగమనడం మనం అంతకుముందు ప్రోమోలో చూసిందే.. ఇక చివర్లో రామ్ చరణ్ కు ఫోన్ చేసిన బాలయ్య.. సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు ఆ తరువాత మీ నాన్నగారి సినిమ చూడు అని చెప్పడం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ప్రోమోలో నవ్వులే నవ్వులు అని చెప్పొచ్చు. ఈ స్పెషల్ ప్రోమోతో ఎపిసోడ్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. డిసెంబర్ 30 న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version