NTV Telugu Site icon

NTR 30: ఇంట గెలిచి.. రచ్చ గెలువు పాప

Janvi

Janvi

NTR 30: సాధారణంగా స్టార్లు రెండు రకాలుగా ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలిచేవారు.. రచ్చ గెలిచి ఇంట గెలిచేవారు. నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే చూస్తారు. అంటే.. ఎవరి భాషల్లో వారు హిట్ అందుకొని.. వేరే భాషల్లో ట్రై చేయడం అన్నమాట. స్టార్ల వారసులు అయితే.. ఇంట గెలిచి రచ్చ కెక్కుతారు. అక్కడ హిట్లు కొట్టి పక్క ఇండస్ట్రీలోఅడుగుపెడతారు. ప్రస్తుతం ఇదంతా ఎందుకు అంటే.. ఎన్టీఆర్ 30 లాంటి పాన్ ఇండియా సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్, శ్రీదేవి ముద్దుల కూతురు బాలీవుడ్ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా జరిగిందో చెప్పనవసరం లేదు. అయితే ఎంత గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. హిట్ అని చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదు. వరుస సినిమాలు చేస్తూనే వస్తుంది కానీ, విజయాలు మాత్రం అందడం లేదు. స్టార్ హీరోల సరసన చేసింది, ఫిమేల్ సెంట్రిక్ చేసింది, ప్రయోగాలు చేసింది.. అయినా ప్రయోజనం లేదు.

Dhanush: కిల్లర్.. కిల్లర్.. కెప్టెన్ మిల్లర్.. వచ్చేశాడు

ఇక ఇప్పుడు మరో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టింది..అదే ‘ఉలాజ్’. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపైనే అమ్మడు ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాలో జాన్వీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది. దీంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా కనుక బాలీవుడ్ హిట్ అయితే.. టాలీవుడ్ లోకి అమ్మడు ఇంట గెలిచి రచ్చ గెలవడానికి వచ్చిన హీరోయిన్ అని అనిపించుకుంటుంది. ఒకవేళ ఇది కూడా ప్లాప్ అయితే.. ఇక ఎన్టీఆర్ 30 మీదనే ఆశలు పెట్టుకోవాలి. ఎలాగైనా ఈసారి ఈ సినిమాతో హిట్ కొట్టి ఇంట గెలిచి.. రచ్చ గెలువు జాన్వీ అంటూ ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి జాన్వీ లక్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Show comments