Site icon NTV Telugu

SK20: ఉక్రెయిన్ బ్యూటీని రంగంలోకి దింపిన జాతిరత్నం

Maria Raboshapka

Maria Raboshapka

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న అనుదీప్ కెవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం అనుదీప్.. ఉక్రెయిన్ నటిని రంగంలోకి దింపాడు. ప్రసిద్ధ భారతీయ వెబ్-సిరీస్ ‘స్పెషల్ ఆప్స్’ లో కీలక పాత్ర పోషించిన మరియా ర్యాబోషప్కా ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన నటించనుంది. వెల్ కమ్ మరియా అంటూ మేకర్స్ ఆమెను సినిమాలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఉక్రెయిన్ బ్యూటీ హిట్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version