Site icon NTV Telugu

Udaya Bhanu : అల్లు అర్జున్ తో చేసి.. పవన్ సినిమాకు నో.. ఉదయభానుపై ట్రోల్స్

Udayabhanu

Udayabhanu

Udaya Bhanu : ఉదయభాను ఈ మధ్య కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్ అవుతోంది. ఆ మధ్య సుహాస్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ యాంకర్లు అందరూ సిండికేట్ అయిపోయారంటూ బాంబు పేల్చింది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ త్రిబాణధారి బార్బరిక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో టాలీవుడ్ మీద చేస్తున్న కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. రీసెంట్ గా ఆమె మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయమని అడిగితే చేయనని చెప్పానని తెలిపింది. అదే టైమ్ లో.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి సినిమాలో స్పెషల్ సాంగ్ చేశానని తెలిపింది. ఇంకేముంది ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియాలో దుమారం రేపేశాయి.

Read Also : NTR Fan : అందుకే ఎన్టీఆర్ పై బూతుల ఆడియో లీక్ చేశా

పవన్ కల్యాణ్‌ తో చేయనని చెప్పి అల్లు అర్జున్ తో చేస్తావా అంటూ కొందరు పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలెట్టేశారు. వాస్తవానికి ఆమె చెప్పింది ఏంటంటే.. జులాయి సినిమాలో చేసిన సాంగ్ లో తాను ఒక్కదాన్నే కనిపిస్తాను కాబట్టి చేశానన్నారు. పైగా ఆ సాంగ్ స్క్రిప్ట్ లో భాగంగా వస్తుంది కాబట్టే ఒప్పుకున్నానని అన్నారు. అత్తారింటికి దారేది మూవీలో పార్టీ సాంగ్ కోసం అడిగారని.. అందులో సమంత, ప్రణీత లాంటి స్టార్లు ఉంటారు కాబట్టి.. వాళ్ల మధ్యలో తనను ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతోనే చేయలేదని తెలిపింది. అంతే గానీ పవన్ సినిమా చేయనని చెప్పలేదు. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వకపోవడంతో ట్రోల్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. రానా హీరోగా వచ్చిన లీడర్ సినిమాలోనూ ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. తనకు స్క్రిప్ట్ నచ్చితే ఆ సాంగ్ అవసరం అనుకుంటే తప్పకుండా చేస్తానని.. లేదంటే చేయనని నేరుగానే చెప్పేస్తానంటూ తెలుపుతోంది ఉదయభాను.

Read Also : Vishwambhara : విశ్వంభర వాయిదా.. అనిల్ రావిపూడి ఫుల్ హ్యాపీ

Exit mobile version