Site icon NTV Telugu

Uday Kiran: ఈ టాప్ సింగర్ ఉదయ్ కిరణ్ చెల్లి అని మీకు తెలుసా..?

Uday

Uday

Uday Kiran: టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అంటే అతనిపేరే చెప్పేవారు. లవర్ బాయ్ గా, పక్కింటి కుర్రాడిగా.. మిడిల్ క్లాస్ కొడుకుగా రియల్ లైఫ్ లో చూపించాలంటే.. ఉదయ్ కిరణ్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చేవారు. నువ్వు నేను అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్నో మంచి సినిమాలు చేసి మెప్పించిన ఉదయ్ కిరణ్ లైఫ్ ఎలా టర్న్ అయ్యిందో అందరికి తెల్సిందే. పెళ్లి తరువాత.. సినిమా అవకాశాలు లేక.. చాలా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. అయితే అసలు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు అసలు కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు అనే చెప్పాలి. ఇప్పటికీ ఆయన ఈ లోకంలో లేకపోయినా .. ఆయన సినిమాల ద్వారా ఎల్లప్పుడూ బతికేఉంటాడు.

Devara : విఎఫ్ఎక్స్ వర్క్ కోసం భారీగా ఖర్చు చేయబోతున్న మేకర్స్..?

ఇప్పుడు ఉదయ కిరణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే.. ఆయన చెల్లి టాప్ సింగర్ గా కొనసాగుతుంది కాబట్టి. అవును ఉదయ కిరణ్ కు ఒక చెల్లి ఉంది. సొంత చెల్లి కాదు కానీ, చిన్నమ్మ కూతురు.. పేరు పర్ణిక మాన్య. ఏంటిజీ తెలుగు సరేగమప లో పాల్గొన్న పర్ణికనా అంటే .. అవును ఆమెనే. పర్ణిక, ఉదయ్ కిరణ్ చిన్నతనం నుంచి చాలా క్లోజ్ గా ఉండేవారట. తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. “అన్న ఏ విషయాలను అయినా నా దగ్గర చెప్పేవాడు. అన్నయ్య ఎంతో మంచి మనసున్న వ్యక్తి. ఇంత చిన్న వయస్సులోనే మాకు దూరమవుతాడని మేము అనుకోలేదు. ఇండస్ట్రీలో నేను అన్నయ్య పేరును ఎప్పుడు వాడుకోవాలనుకోలేదు. అందుకే చెప్పలేదు..” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నెట్టింట పర్ణిక వాఖ్యలు వైరల్ గా మారాయి.

Exit mobile version