అప్పుడలా… ఇప్పుడిలా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ మనిషినైనా మంచివాడుగా, చెడ్డవాడుగా చిత్రీకరించేవి – అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. ఓ మనిషి దొంగకావడానికి అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అని చర్చించవలసి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించే కరడు కట్టిన నేరస్థులలో సైతం పరివర్తన కలిగించాలని సామాజిక ఉద్యమకారులు గోరా, ఆయన కోడలు హేమలతా లవణం నడుం బిగించారు. ఎందరో దొంగలలో సత్ర్పవర్తన కలిగేలా చేశారు. అలా ప్రకాశం జిల్లాలో స్టూవర్ట్ పురం అనే ఊరిలో దొంగలలో మార్పు తీసుకు రాగలిగారు. అప్పట్లో రాష్ట్రంలో ఏదైనా పెద్ద దొంగతనం జరిగితే, అందులో స్టూవర్ట్ పురం దొంగల పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీసేవారు. ఈ విషయాలను చర్చిస్తూ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ 1990లో ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అనే సీరియల్ రాశారు. తరువాత అదే నవలగా వెలుగు చూసింది. ఈ కథతోనే మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా కె.ఎస్.రామారావు, ఆ కథారచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలోనే ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ చిత్రం నిర్మించారు. 1991 జనవరిలో సంక్రాంతి బరిలో ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ నిలచింది. కానీ, జనం మదిని గెలవలేకపోయింది.
సరిగా ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ విడుదలయిన సమయంలోనే అదే స్టూవర్ట్ పురం వాసుల నేపథ్యంలో ‘స్టూవర్ట్ పురం దొంగలు’ సినిమా తెరకెక్కింది. సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, చరణ్ రాజ్, నాజర్, వల్లభనేని జనార్దన్, బాబూ మోహన్ నటించారు. చిత్రమేమంటే, టాప్ స్టార్స్ ఉన్న ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ కంటే ‘స్టూవర్ట్ పురం దొంగలు’ జనాన్ని ఆకట్టుకుంది.
Also Read
- The Paradise: 'పెద్ది' రిజల్ట్ చూశాక కూడా 'ది పారడైజ్' పాఠాలు నేర్వలేదా?
- Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
- Chiranjeevi – Odela Movie: 'కాకా' తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
- Satya Master: "నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?" జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
కట్ చేస్తే… మళ్ళీ ఇన్నాళ్ళకు స్టూవర్ట్ పురం నేపథ్యంలో రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. అందులో ఒక సినిమాను బెల్లంకొండ సురేశ్, తన తనయుడు సాయిశ్రీనివాస్ హీరోగా ‘స్టూవర్ట్ పురం దొంగ’ పేరుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్. దర్శకత్వం వహించనున్నారు. ఆగస్టు 11వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. అదే స్టూవర్ట్ పురం బ్యాక్ డ్రాప్ లో ఇంకో సినిమాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపొందనున్నట్టు నవంబర్ 3న ప్రకటించారు. ఈ చిత్రంలో రవితేజ కథానాయకుడు. ఇంతకు ముందు ‘దొంగాట, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలు తెరకెక్కించిన వంశీ ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ను రూపొందించనున్నారు. ఈ ప్రకటన రాగానే దీపావళి సందర్భంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో తెరకెక్కబోయే ‘స్టూవర్ట్ పురం దొంగ’ లుక్ రిలీజ్ కావడం గమనార్హం! దీంతో ఆ నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. 30 ఏళ్ళ క్రితం స్టూవర్ట్ పురం నేపథ్యంలోనే రెండు చిత్రాలు విడుదలై చర్చ సాగింది. మళ్ళీ ఇన్నాళ్ళకు అదే స్టూవర్ట్ పురం బ్యాక్ డ్రాప్ లో మరో రెండు చిత్రాలు తెరకెక్కబోవడం విశేషమే మరి. ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో, వీటిలో ఏ చిత్రం జనం మదిని దోచేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
-
Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?