Samantha- Saipallavi : స్టార్ హీరోయిన్లు సమంత, సాయిపల్లవిపై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వీరిద్దరిపై విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. పహల్గాంలో టెర్రరిస్టుల దాడితో దేశమంతా తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సమంత, సాయిపల్లవి చేస్తున్న పనులు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సమంత అయితే ఈ ఘటనపై కనీసం స్పందించలేదు. దాడిని ఖండించలేదు. అసలు ఆ దాడి జరిగినట్టే తనకు తెలియదన్నట్టు తన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటుంది. గతంలో గాజాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందించింది. అలాంటిది మన సొంత దేశంపై ఇంత పెద్ద దాడి జరిగితే.. తనకేం సంబంధం లేదు అన్నట్టు సైలెంట్ గా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read Also : Nani : అటు హీరోగా.. ఇటు నిర్మాతగా.. నాని డబుల్ సక్సెస్..
పాకిస్థాన్ కు సింధు నది జలాలను భారత్ ఆపేసిన టైమ్ లో.. సమంత ఓ పోస్టు పెట్టింది. నదులు, వాగులను ఆపొద్దని.. పరుల కోసం మనం జీవించాలి అంటూ చెప్పే ఓ పోస్టు పెట్టింది. ఇంకేముంది నెటిజన్లు సమంతను ఏకిపారేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఈ దిక్కుమాలిన పోస్టులు పెడుతావా.. పాకిస్థాన్ కు సపోర్టు చేస్తున్నావా అంటూ తిట్టిపోస్తున్నారు. పరాయి దేశం మీద ఉన్న ప్రేమ సొంత ప్రేమ మీద లేదా నీకు.. నువ్వు హీరోయిన్ వా అంటూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు సమంతను.
ఇక సాయిపల్లవి ఈ దాడిపై స్పందించింది. కానీ ఆమె దాన్ని తీవ్ర స్థాయిలో ఖండించలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఇదే సాయిపల్లవి ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ ఒకటే అంటూ చెప్పిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ లేకపోతే మన పరిస్థితి ఏంటి అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు. సాయిపల్లవి దాడి మీద స్పందించినా.. ఆమె మీద విమర్శలు మాత్రం ఆగట్లేదు. ఇలా ఇద్దరు స్టార్ హీరోయిన్లను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఇంత జరిగినా సరే వీరిద్దరూ ఎలాంటి వీడియోలను రిలీజ్ చేయకపోవడం గమనార్హం.
Read Also : Pakistani YouTuber: ‘‘వారిని సె*క్స్ బానిసలుగా చేయాలనుకుంటున్నా’’ పాక్ యూట్యూబర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
