Site icon NTV Telugu

Akshay Kumar : షారుఖ్, అజయ్ లతో కలిసి యాడ్… ఏకిపారేస్తున్న నెటిజన్లు

Akshay Kumar

Akshay Kumar

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన పనికి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. షారుఖ్, అజయ్ లతో కలిసి ఇలాంటి యాడ్ చేస్తావా ? అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేనా ఆయన అంతకుముందు అలాంటి యాడ్స్ పై కామెంట్స్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ… చెప్పింది చేయనప్పుడు ఇలా నీతులు చెప్పడం దేనికి ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ యాడ్ ఏమిటంటే… బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ నుంచి షారుఖ్, అజయ్ దేవగణ్ వంటి స్టార్ హీరోలను వివాదంలోకి నెట్టిన పాన్ మసాలా యాడ్.

Read Also : KGF 2 : ఫ్యాన్స్ రచ్చ… లాఠీలకు పని చెప్పిన పోలీసులు

ఈ యాడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో షారుఖ్, అజయ్ దేవగణ్ కారు నడుపుతూ అక్షయ్ గురించి మాట్లాడుతుండగా, ఓ యాక్షన్ స్టంట్ ద్వారా అక్షయ్ ఆ పాన్ మసాలాను నోట్లో వేసుకోవడం కన్పిస్తోంది. అయితే గతంలో అక్షయ్ కుమార్ తాను అలాంటి యాడ్స్ చేయబోనని, డబ్బుల కోసం జనాలకు హాని కలిగించే ప్రొడక్ట్స్ జోలికి వెళ్లబోనని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఈ యాడ్ రాగానే, ఆ వీడియోను షేర్ చేస్తూ, దానికి సంబంధించిన మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఇక తమ అభిమాన స్టార్స్ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గుట్కా, పాన్ మసాలా వంటి యాడ్స్ చేయడం పట్ల అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ స్టార్స్ మాత్రం ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం ఆపడం లేదు.

https://twitter.com/AmitSin23925078/status/1514451955107524608?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1514451955107524608%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.news18.com%2Fnews%2Fbuzz%2Fakshay-kumar-joining-pan-masala-ad-after-dissing-gutkha-in-old-video-gets-memed-4979473.html

Exit mobile version