Guntur Kaaram: మహేష్ కోసం మాటలే కాదు పాటలు కూడా రాస్తున్న మాంత్రికుడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని కూలంకుషంగా చెప్పడంలో, అందరికీ అర్ధమయ్యే సాధారణ భాషలో చెప్పడంలో దిట్ట త్రివిక్రమ్. పురాణాల రిఫరెన్స్ తో ఎంతో కష్టమైన డైలాగ్ ని కూడా ఈజీగా అర్ధం అయ్యేలా రాయగలడు త్రివిక్రమ్. అందుకే ఆయన్ని అందరూ మాటల మాంత్రికుడు అంటారు. ఈ మాటల మాంత్రికుడు మహేష్ బాబు కోసం పాటలు కూడా రాసే పనిలో ఉన్నాడట. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ తో గుంటూరు కారం చేస్తున్నాడు త్రివిక్రమ్. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ డిసెంబర్ 13న బయటకి రానుంది. ఇప్పటికే ఈ లిరికల్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు మేకర్స్. “ఓ మై బేబీ’ అంటూ సాగనున్న ఈ సాంగ్ లో కొన్ని స్పెషల్ లిరిక్స్ ని త్రివిక్రమ్ రాస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
“ఓ మై బేబీ” పాటనే కాదు గుంటూరు కారం సినిమా నుంచి మొదటి ప్రమోషనల్ కంటెంట్ గా బయటకి వచ్చిన ‘మాస్ స్ట్రైక్” వీడియోలోని లైన్స్ ని కూడా రాసింది త్రివిక్రమ్ అనే మాట ఉంది. “సన్న కర్ర.. సవ్వా దెబ్బ..! బొడ్డురాయి.. బేటా దెబ్బ..! రవ్వల దెబ్బ.. దవడ అబ్బ.. ఉయ్ !! సరా సరా శూలం.. సుర్రంటాంది కారం! ఎడా పెడా చూడం.. ఇది ఎర్రెక్కించే బేరం! సరా సరా శూలం.. సుర్రంటాంది కారం! ఇనుప సువ్వ.. కౌకు దెబ్బ.. ఇరగదీసే రవ్వల దెబ్బ.. ఉయ్ !!” అంటూ మాస్ స్ట్రిక్ కి లైన్స్ అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు ఓ మై బేబీ సాంగ్ కి ఎలాంటి స్పెషల్ లిరిక్స్ ని పెన్ డౌన్ చేసాడు… ఫుల్ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకి త్రివిక్రమ్ ఎలాంటి టచ్ ని ఇచ్చాడో చూడాలి.
Also Read
- OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న'OG'
- Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
- Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
తాజావార్తలు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
-
OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న’OG’
-
Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!