NTV Telugu Site icon

Ashlesha Thakur: ప్రియమణి కూతురు హీరోయిన్ గా ‘శాంతల’.. సాంగ్ లాంఛ్ చేసిన త్రివిక్రమ్

Untitled 1 Copy

Untitled 1 Copy

Ashlesha Thakur’s film Shantala First Single:అదేంటి ప్రియమణికి హీరోయిన్ అయ్యేంత కూతురు ఉందా? అని ఆలోచిస్తున్నారా? . అవును మీ అనుమానం నిజమే, నిజానికి హీరోయిన్ గా మారింది ఆమె రియల్ కూతురు కాదు రీల్ కూతురు. అసలు విషయం ఏంటంటే ప్రియమణి కుమార్తెగా ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ఆశ్లేష ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అశ్లేష ఠాకూర్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది పీరియడిక్ మూవీ, ఈ మూవీకి శాంతల అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె ఎస్ రామారావు గారి సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ను ప్రముఖ దర్శకుడు, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు.

Chandramukhi 2: చంద్రముఖి ఇంటికే వచ్చేస్తోంది.. గెట్ రెడీ

ఈ సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల సినిమాలోని మొదటి పాటని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల సినిమా తెరకెక్కించామని, నవంబర్ 3వ తారీఖున విడుదల అవుతుంది అని వెల్లడించారు. సీతారామం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రానికి సంచలన సంగీతం సమాకూర్చిన విశాల్ చంద్రశేఖర్ శాంతల చిత్రానికి సంగీతం అందించగా సీనియర్‌ నటుడు వినోద్‌ కుమార్‌, వీణా నాయర్‌ తదితరులు నటించారు. ఈ క్రమంలో ఆశ్లేష ఠాకూర్‌ మాట్లాడుతూ చిన్నప్పట్నుంచి నాకు డాన్స్‌, సింగింగ్‌ అంటే చాలా ఇష్టం, ఇందులో నా ఇష్టాలకు దగ్గరైన క్యారెక్టర్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నా క్యారెక్టర్ కోసం చాలా ప్రిపేర్ అయ్యానని ఆమె చెప్పారు.