అక్కినేని సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి సినిమా పట్ల ఉన్న అమితమైన అభిరుచికి సెల్యూట్ చేశారు. “ఈ సమయంలో కూడా ప్రపంచం మొత్తంలో థియేటర్‌లకు వెళ్లి సినిమాలు చూస్తుంది తెలుగు జాతి మాత్రమే. ఇది ఫిల్మ్ మేకర్స్ కు మంచి కంటెంట్‌ను రూపొందించడానికి స్ఫూర్తినిస్తుంది” అని అన్నారు.
సుశాంత్ గురించి మాట్లాడుతూ సుశాంత్ కెరీర్ మొదట్లో ఒక చక్రంలో ఇరుక్కుపోయాడని. అంటే సినిమా ఎలా ఉండాలి అనే క్యాలుక్యులేషన్స్ తో తప్పు అవకాశాలను ఎంచుకున్నాడని అన్నారు. “చిలసౌ”లో నటుడిగా తనను తాను తిరిగి ఆవిష్కరించుకున్నాడని, ఈ సినిమాలో సుశాంత్‌ను చూసిన తర్వాతనే “అల వైకుంఠపురంలో” సినిమాకు అతన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి కెరీర్ టాలీవుడ్‌లో విజయవంతం కావాలని కోరుకుంటూ, తన సినిమాల్లో నటించడానికి ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు.
ఇక సినిమా గురించి మాట్లాడుతూ “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మంచి సినిమా అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. చిత్ర నిర్మాతలు చాలా డబ్బు సంపాదించాలని, ప్రభుత్వానికి చాలా పన్ను చెల్లించాలని నేను కోరుకుంటున్నాను” అని త్రివిక్రమ్ చమత్కరించారు. చివరగా త్రివిక్రమ్ సినిమా దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.
