Site icon NTV Telugu

SSMB 31: మహేష్ ను లైన్లో పెట్టిన గురూజీ.. షరతులు వర్తిస్తాయ్!

Trivikram may Direct Mahesh Babu SSMB 31 : త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ బాబు ఆ సినిమాతో మిశ్రమ స్పందన అందుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మహేష్ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా కోసం మాత్రం అటు మహేష్ తో పాటు మహేష్ అభిమానులు తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ ప్రేమికుల సైతం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కానీ మహేష్ లైనప్ గురించి మాత్రం చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి తో చేసే సినిమా మహేష్ కెరియర్ లో 29వ సినిమా కానుంది. 30వ సినిమా కోసం ముగ్గురు దర్శకులు లైన్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Vijay Sethupathi: హిట్ కొట్టగానే డైరెక్టర్ మారిపోయాడు.. 33 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు!

వారిలో ఎవరో ఒకరు సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, కొరటాల శివ, సుకుమార్ మహేష్ తో 30వ సినిమా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వీరిలో ఎవరో ఒకరు ఫైన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా తరువాత 31 వ సినిమా మాత్రం మరోసారి గురూజీ చేతిలోనే మహేష్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. గుంటూరు కారం సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈసారి ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేసే అవకాశం మహేష్ కల్పించాడనే ప్రచారం అయితే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. మరో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే మహేష్ 30 సినిమాకి ముగ్గురు దర్శకులు లైన్లో ఉన్నా ఒకవేళ వారి కథలు సిద్ధం కాకపోయినా లేక మహేష్ కి నచ్చకపోయినా త్రివిక్రమ్ ఆ సినిమా చేసే అవకాశం కూడా ఉంది అనే వార్త టాలీవుడ్ వర్గాల్లో తిరుగుతోంది. చూడాలి మరి మహేష్ 30వ సినిమా ఎవరితో చేస్తాడు? 31వ సినిమా ఎవరితో చేస్తాడు అనేది.

Exit mobile version