సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పూజా హెగ్డే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది అనే వార్త బయటకి రావడం, థమన్ ఇంకా సాంగ్స్ కంపోజ్ చేయలేదు అనే మాట వినిపించడం… ఇలా రకరకాల రూమర్స్ గుంటూరు కారం సినిమా గురించి వినిపిస్తూనే ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ ఎలాంటి రూమర్ పియా క్లారిటీ ఇవ్వకపోవడంతో గుంటూరు కారం సినిమా విషయంలో ఏం జరుగుతుందో అభిమానులకి కూడా అర్ధం కావట్లేదు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లాడు.
మళ్లీ గుంటూరు కారం సినిమా షూటింగ్ కి మూడు వారాల గ్యాప్ వచ్చిందని అంతా అనుకుంటున్న టైములో త్రివిక్రమ్, మహేష్ లేని సీన్స్ ని ఆగస్టు 2నుంచి షూట్ చేయడానికి రెడీ అయ్యాడు. మిగిలిన ఆర్టిస్టులతో సీన్స్ ని తెరకెక్కిస్తే మహేష్ వచ్చే సరికి కొంతభాగం అయినా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే గుంటూరు కారం సినిమా ఆన్ టైం కంప్లీట్ అవుతుంది. మూడు వారాల తర్వాత మహేష్ ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగిరాగానే మహేష్ సీన్స్ ని షూట్ చేయనున్నారు. రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ దాదాపుగా ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ కి అయితే విడుదలయ్యే అవకాశం కనిపించట్లేదు. సంక్రాంతి నుంచి సమ్మర్ సీజన్ కి గుంటూరు కారం షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.