Trisha: హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా త్రిష పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపుగా అందరూ అగ్రహీరోల సరసన నటించింది. చిరంజీవితో స్టాలిన్, బాలయ్యతో లయన్, నాగార్జునతో కింగ్, వెంకటేష్‌తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బాడీగార్డ్, ప్రభాస్‌తో వర్షం, పౌర్ణమి.. మహేష్‌తో అతడు, ఎన్టీఆర్‌తో దమ్ము లాంటి సినిమాలు చేసింది. ఇప్పటికీ అవకాశం వస్తే లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తోంది. తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి తెలుగులో దుమ్మురేపి మళ్లీ కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. తాజాగా త్రిష రాజకీయాల్లోకి వస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళంలో విలన్‌గా రాణిస్తున్న విజయ్ సేతుపతి సూచన మేరకు రాజకీయ అరంగేట్రం చేయాలని త్రిష భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Thiefs Arrest: మారని దొంగ తీరు.. పదేపదే దొంగతనాల జోరు
ఇప్పటికే తమిళంలో జయలలిత, ఖుష్బూ లాంటి నటీమణులు రాజకీయాల్లో వచ్చారు. జయలలిత ఏకంగా సీఎంగా . ఆ తర్వాత ఖుష్బూ మొదట కాంగ్రెస్‌లో చేరి తర్వాత బీజేపీలోకి వెళ్లింది. ఇప్పుడు త్రిష రూపంలో ఖుష్బూ వెళ్లిపోయిన లోటును కాంగ్రెస్ పూడ్చుకోవాలని చూస్తోంది. అయితే సిల్వర్ స్క్రీన్‌పై తన గ్లామర్, నటనతో అభిమానులను సంపాదించుకున్న ఆమె.. పాలిటిక్స్‌లో ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జయలలిత, ఎంజీఆర్ తరహాలో పాలిటిక్స్‌లో రాణించాలని త్రిష కలలు కంటోందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మూవీ పొన్నియిన్ సెల్వన్‌లో నటిస్తోంది.