NTV Telugu Site icon

Trisha: ఆ నిర్మాతతో పెళ్లంటూ ప్రచారం.. త్రిష మాస్ వార్నింగ్

Trisha 1

Trisha 1

Trisha Indirect warning to Gossips Creators: హీరోయిన్ గా సుమారు 21ఏళ్లు క్రితం ఎంట్రీ ఇచ్చిన త్రిష ఇప్పటికీ బ్రేకులు లేకుండా దూసుకు పోతూ ఉన్నారు . నేటికీ తరగని అందంతో మెరిసిపోతున్న ఆమె ఈమధ్యనే పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా కుందవై అనే పాత్రలో మెరిశారు. ఇక 40 దాటాక కూడా హీరోయిన్ గా సత్తా చాటుతూనే ఉన్నారు త్రిష చేతిలో తమిళ, మలయాళ సినిమాలు అన్నీ కలుపుకొని ఓ అరడజను దాకా ఉన్నాయి. మోస్ట్ అవైటెడ్ విజయ్‌, లోకేశ్‌ కనకరాజ్‌ ‘లియో’లో కూడా త్రిష హీరోయిన్. ఇలా ఒకపక్క ఆమె కెరీర్‌ ఇంత పీక్స్‌లో ఉండగా మరో వైపు ఆమె పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో అయితే పెద్ద ఎత్తున హల్‌చల్‌ చేస్తున్నాయి. గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్‌మెంట్‌ జరిగి ఆ తరువాత పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయింది. అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ మళ్లీ ఇన్నాళ్లకు త్రిష పెళ్లి వార్తలు తమిళ మీడియాలో బలంగానే వినపడుతున్నాయి.

OTT Update: బడా ఓటీటీ సంస్థల షాకింగ్ డెసిషన్… టెన్షన్లో టాలీవుడ్ మేకర్స్!

ఆమె ఓ మలయాళ నిర్మాతను పెళ్లాడబోతున్నారని ప్రచారం మొదలైంది. గతంలో అతను చేసిన సినిమాలో త్రిష నటించిందని ఆ సమయంలోనే ఇద్దరిమధ్య ప్రేమ చిగురించిందనీ ప్రచారం మొదలైంది. ఇక త్వరలో అతనితో త్రిష ఏడడుగులు వేయబోతున్నారు అనిఅంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదే పెళ్లి అని కూడా ప్రచారం జరుగుతన్న సమయంలో త్రిష ఒక వార్నింగ్ లాంటి క్లారిటీ ఇచ్చింది. డియర్, “మీరు మరియు మీ బృందం ఎవరో మీకు తెలుసు”, “ప్రశాంతంగా ఉండండి అలాగే పుకార్లు ఆపండి అని అంటూనే ఆమె చీర్స్ అని పేర్కొంది. ఒకరకంగా త్రిష ఇలా పుకార్లు పుట్టించినవారికి వార్నింగ్ ఇచ్చిందని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఇలా పుకార్లు పుట్టిస్తున్నారో అది ఆమెకు తెలుసు అని అందుకే వారికి తగిలేలా ఆమె వార్నింగ్ ఇచ్చారు అంటూ ప్రచారం మొదలైంది.

Show comments