Site icon NTV Telugu

Tripti Dimri: ఏంటి మామ.. ఈ షాక్.. జోయా పాప.. విరాట్ కోహ్లీ చెల్లెలా..?

Virat

Virat

Tripti Dimri: యానిమల్ సినిమా… సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక కన్నా.. సెకండ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి గురించే టాక్ నడుస్తోంది. జోయాగా ఆమె క్యారెక్టర్ కు, రొమాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నేషనల్ క్రష్ గా ఉన్న రష్మికను కూడా పక్కన పెట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి ఆమెను నేషనల్ క్రష్ గా మార్చేశారు. ఇక అమ్మడు వరుస అవకాశాలను అందుకొని ఇండస్ట్రీ మొత్తానికి టాక్ ఆఫ్ ది టౌన్ గానిలిచింది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ లో ఈ చిన్నది ఛాన్స్ పట్టేసిందని టాక్. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ భామ.. క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెల్లెలు అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏంటి ఇది నిజమా.. ? అని ఆశ్చర్యపోకండి. అసలు ఈ ముద్దుగుమ్మ విరాట్ కు చెల్లెలు ఎలా అయ్యింది అనేది చూద్దాం.

Harish Shankar: సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు.. యానిమల్ రివ్యూ ఇచ్చిన పవన్ డైరెక్టర్

త్రిప్తి హిందీలో బుల్ బుల్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాకు నిర్మాత కర్నేష్ శర్మ. స్వయానా.. హీరోయిన్, విరాట్ భార్య అనుష్క శర్మకు అన్నయ్య. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక్క వీరిద్దరూ కలిసి పార్టీలు, పబ్ లు అంటూ తిరిగారంట కూడా. త్వరలోనే ఈ జంట వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. విరాట్ కు కర్నేష్ బావ అంటే.. త్రిప్తి చెల్లి వరుసనే కదా అయ్యేది. అందుకే విరాట్ చెల్లి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే ఈ జంట విడిపోయిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు ఒకరిని ఒకరు ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ చేసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా.. విరాట్ కు ఈ భామ చెల్లి అంటే షాకింగ్ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version