Site icon NTV Telugu

పవన్ బర్త్ డే కు ట్రిపుల్ ధమాకా

Pawan and Harish Movie Update on Sep 2nd

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సైలెంట్ గా అన్ని సన్నాహాలు చేసేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరో పేరుతో బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ తో మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మేకర్స్ కూడా వారి సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ తో పవన్ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసే పనిలో లీనమయ్యారని అంటున్నారు.

Read Also : “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్

రేపు పవన్ నటిస్తున్న మూడు సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అందులో పవన్, రానా మల్టీస్టారర్ “భీమ్లా నాయక్” నుంచి స్పెషల్ గా పోస్టర్ తో పాటు ఫస్ట్ సింగిల్ ను కూడా విడుదల చేస్తారని భావిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆయన నెక్స్ట్ మూవీ “హరిహర వీరమల్లు”. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి కూడా అప్డేట్ రానుందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఆ తరువాత వరుసలో హరీష్ శంకర్ మూవీ ఉంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ప్రస్తుతానికి “పిఎస్పీకే28” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ ప్రీ లుక్ రిలీజ్ చేస్తారని టాక్. రేపు మెగా ఫ్యాన్స్ కు ట్రిపుల్ ధమాకా మాత్రమే కాదు మరో సర్ప్రైజ్ కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అదే సురేందర్ రెడ్డి, పవన్ సినిమా గురించి. మొత్తానికి పవన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ రోజున పండగ వాతావరణం నెలకొననుందన్నమాట.

Exit mobile version