“సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్

మాచో హీరో గోపీచంద్ తాజా స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంతో సినిమా ప్రమోషన్లను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పాన్ ఇండియా లెవెల్లో జరగబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఎప్పుడనే విషయాన్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు సెప్టెంబర్ 4న లేదంటే 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నాహాలు చేస్తున్నారట. హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్న “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని, ఆయన కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు గోపీచంద్ కు క్లోజ్ ఫ్రెండ్ కూడా.

Read Also : “థాంక్యూ కలెక్టర్ స్టోరీస్” లాంచ్ చేసిన సాయి ధరమ్ తేజ్

వారిద్దరి మధ్య “వర్షం” సినిమా నుంచి గాఢమైన స్నేహం నడుస్తోంది. ఆ సినిమాలో ప్రభాస్ హీరోగా, గోపీచంద్ పవర్ ఫుల్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత గోపీచంద్ విలన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్నారు. తాజాగా స్నేహితుడి సినిమా వేడుకకు హాజరై సినిమాకు కావాల్సిన హైప్ ను పెంచడంలో తనవంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట.

నిజానికి గోపీచంద్ కు 2015లో వచ్చిన “జిల్” మూవీ తరువాత సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ఆ సినిమా తరువాత అయిదారు సినిమాల్లో ఈ హీరో నటించినప్పటికీ అవి ప్రేక్షకులకు ఏమాత్రం రుచించక పక్కన పెట్టేశారు. గోపీచంద్ ఒకే మూస ధోరణిలో సినిమాలు తీస్తున్నారని అభిమానులు ఫీల్ అయ్యారు. అందుకే ఈసారి స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకుని ఎలాగైనా హిట్ కొట్టి ప్రేక్షకుల చేత “సీటిమార్” వేయించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా విడుదలకు బ్రేకుల మీద బ్రేకులు పడగా… ఎట్టకేలకు సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధమైంది. ముందుగా “సీటిమార్”ను ఏప్రిల్ 2న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో సెప్టెంబర్ 2న అన్నారు. ఇతర పరిస్థితుల కారణంగా వినాయక చవితికి ముహూర్తం ఖరారు విడుదల చేశారు. మరి ప్రభాస్ క్రేజ్ గోపీచంద్ కు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-