Harish Shakar: ‘కిరాయి’కి రెడీ అంటున్న త్రిగుణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో అదిత్ అరుణ్ ఇటీవల త్రిగుణ్ గా తన పేరును మార్చుకున్నాడు. ఈ యేడాదిలో ఇప్పటికే అతను నటించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్లూ’, కథ కంచికి మనం ఇంటికి’ చిత్రాలు విడుదలయ్యాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్ నటించిన ‘కొండా’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఇందులో రాజకీయ నాయకుడు కొండా మురళీగా త్రిగుణ్ నటించాడు. అలానే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే చిత్రంలోనూ త్రిగుణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మధుదీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇవాళ (జూన్ 8) త్రిగుణ్ బర్త్ డే సందర్బంగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అలానే అతని లేటెస్ట్ మూవీ ‘కిరాయి’ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. దీనిని ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఆవిష్కరించడం విశేషం. ఈ క్రైమ్ డ్రామాను వి.ఆర్.కె. దర్శకత్వంలో నవీన్ రెడ్డి, అమూల్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హరిగౌర సంగీతం అందిస్తున్నారు. త్రిగుణ్ ఈ మూవీలో మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్టు తెలిసిందని, ఈ సినిమా కథ విన్న తర్వాత చూడాలనే ఆసక్తి కలిగిందని హరీశ్ శంకర్ తెలిపారు.
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
చిత్ర దర్శకుడు వి.ఆర్.కె. (రామకృష్ణ) మాట్లాడుతూ, ”గుంటూరు, పల్నాడులో ఒకప్పుడు ఎక్కువగా హత్యలు జరిగేవి. దాని ఆధారంగా మేము గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాం. ఇందులో హీరో కిరాయి తీసుకోకుండా కిరాయిహత్య చేయవలసి వస్తుంది. అలా ఎందుకు చేయవలసి వచ్చింది? ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు? ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేదే ఈ కథ. ఇందులో హీరోగా నటించిన త్రిగున్ కు మంచి బ్రేక్ వస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా రష్ అండ్ ఫస్ట్ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ చాలా బాగుందని మెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో యాక్షన్ మాములుగా ఉండదు. ఒక ట్రాన్స్ ఫార్మర్ బద్దలయితే ఎలా ఉంటుందో అలా హెవీ యాక్షన్ తో ఆడియన్స్ కు థ్రిల్ ఇవ్వ బోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది” అని అన్నారు
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!