సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఒకటి కాదు ఒకేసారి మూడు అప్డేట్ లతో సూపర్ స్టార్ అభిమానులను ముంచెత్త బోతున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ట్రిపుల్ ధమాకా కానుంది. ఆగస్టు 9న “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అనే స్పెషల్ ను ఉదయం 9 గంటలకు, ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” చిత్రం నుంచి ఉదయం 12 గంటలకు పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు నెక్స్ట్ మూవీ “ఎస్ఎస్ఎంబి 28” నుంచి మహేష్ ను విష్ చేయనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే.
Read Also : ఫస్ట్ లుక్ : “దుర్గ”గా రాఘవ లారెన్స్
ఒకేరోజు మూడు అప్డేట్లు రావడంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఆయన తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా ఒక్కొక్కరూ 3 మొక్కలు నాటాలి అంటూ రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు… పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట” చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నారు.
