NTV Telugu Site icon

Nisha Noor: స్టార్ హీరోయిన్.. వ్యభిచారిగా మారి.. చివరికి ఎయిడ్స్ తో ..

Nish

Nish

Nisha Noor: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇందులో నెగ్గుకురావడం చాలా కష్టం. పైకి రంగులు వేసుకొని మెప్పించడం మాత్రమే అందరికి తెలుసు..కానీ, ఆ రంగు వెనుక ఒక చీకటి ప్రపంచం ఉంటుంది అని చాలా తక్కువమందికి తెలుసు. ఆ చీకటి ప్రపంచంలో కొట్టుకుపోయిన తారలు ఎంతోమంది.. అందులో నిషా నూర్ ఒకరు. నిషా.. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. 1980 దశకంలో కమల్ హాసన్, రజినీకాంత్, భాను చందర్, రాజేంద్రప్రసాద్ లాంటి స్టార్ హీరోల సరసన కనిపించి మెప్పించింది. కమల్‌తో టిక్‌ టిక్‌ టిక్‌.. రాజేంద్రప్రసాద్‌తో ఇనిమై ఇదో ఇదో.. రజనీకాంత్‌తో శ్రీ రాఘవేంద్ర.. మమ్ముట్టితో అయ్యర్‌ ద గ్రేట్‌.. మోహన్‌లాల్‌తో దేవసురమ్‌ లాంటి సినిమాల్లో కనిపించిన నిషా.. సడెన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఒక దుర్మార్గపు నిర్మాత వలలో చిక్కుకొని వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయింది. అలా ఎందుకు చిక్కుకుంది అంటే.. అవకాశాలు లేక .. ఎంత స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుందో.. అవకాశాలు లేక.. డబ్బు కోసం విలవిలలాడే పరిస్థితికి చేరుకుంది. ఎక్కడకు వెళ్లినా అవకాశాలు అందకపోయేసరికి.. చేసేది లేక డబ్బు కోసం ఒక నిర్మాత పంచన చేరింది. అతడు ఆమె అందాన్ని చూసి.. డబ్బు వస్తుందని చెప్పి.. ఆమెను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపాడు.

Narne Nithin: ఎన్టీఆర్ బావమరిది.. అల్లు అరవింద్ చేతిలో.. నో కన్ఫ్యూజన్

మొదట బలవంతంగా వెళ్లినా.. ఆ తరువాత ఆమె అక్కడేఉండిపోవాల్సి వచ్చింది. ఎంత బయటపడాలి అని చూసినా.. ఆ నరకం నుంచి బయటపడలేకపోయింది. ఇక అలా ఉన్నప్పుడే ఆమె ఎయిడ్స్ బారిన పడింది. అందం కరిగిపోయింది.. బలం లేకపోయింది.. ఎంతో అందంగా ఉండే నిషా.. అందవిహీనంగా మారేసరికి ఆ వ్యభిచార కూపం కూడా ఆమెను బయటకు నెట్టేసింది. ఎక్కడకు పోలేని పరిస్థితిలో నడిరోడ్డుపై ముష్టి ఎత్తుకొని బతికింది. చివరకు దర్గాలో ఆమె తలదాచుకునే దుస్థితి. ఇక ఆమెను గుర్తుపట్టిన ఒక ఎన్జీవో.. హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా .. ఎయిడ్స్ ముదురిపోయిందని తెలిపినట్లు సమాచారం. అలా ఆమె 2007 లో కన్నుమూసింది. ఎలాంటి ఒక హీరోయిన్.. ఎలా బతికిన నటి .. చివరికి అలా అనాధల నడిరోడ్డుపై ఎయిడ్స్ తో మృతి చెందింది. ప్రస్తుతం ఈమె కథ నెట్టింట వైరల్ గా మారింది.