Site icon NTV Telugu

Palli Chattambi: తెలుగులోకి టోవినో థామస్ సినిమా.. అసలేంటీ పళ్లి చట్టంబి?

Palli Chattambi

Palli Chattambi

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “పళ్లి చట్టంబి”, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్, సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది, ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్ మరియు సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జన గణ మన’ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన డిజో జోస్ ఆంటోనీ ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం, కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయరాఘవన్, సుధీర్ కరమన వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read :Malavika Mohanan : ప్రొడ్యూసర్లు నమ్మితే.. హీరోయిన్లు కూడా రికార్డులను తిరగరాస్తారు

ఈ సినిమా 1950, 60ల కాలం నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీగా రూపొందుతోంది, విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాలోని గాంభీర్యాన్ని, ఆనాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. టొవినో థామస్ తన కెరీర్‌లోనే ఇప్పటివరకు చేయని ఒక వైవిధ్యమైన లుక్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, తెలుగులోనూ అదే మలయాళ టైటిల్ “పళ్లి చట్టంబి”ని కొనసాగించడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

తెలుగు పదాలకు ఏమాత్రం సంబంధం లేని, అర్థం కాని మలయాళ పదాలనే టైటిల్స్‌గా పెట్టడం పట్ల భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అర్థం పర్థం లేని పేర్లు పెడితే మేమెందుకు చూడాలి?” అని కొందరు ప్రశ్నిస్తుంటే, “మన తెలుగు సినిమాలను అక్కడ విడుదల చేసినప్పుడు ఇలాగే పరభాషా టైటిల్స్ పెడితే వాళ్ళు ఆదరిస్తారా?” అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా తెలుగు నేటివిటీ ఉట్టిపడేలా పేర్లు పెట్టాలని, కేవలం కమర్షియల్ లెక్కల కోసం అసలు అర్థం తెలియని టైటిల్స్‌ను రుద్దడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version