Site icon NTV Telugu

2018: ఈ ఇండస్ట్రీ హిట్ మూవీ గీతా ఆర్ట్స్ కి మరో కాంతర అవుతుందా?

2018

2018

హోంబలే ప్రొడ్యూస్ చేసిన కాంతర సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచింది. KGF ఫ్రాంచైజ్ తో డబ్బులు వచ్చాయి, పాన్ ఇండియా ఆడియన్స్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు తిరిగి చూసారు కానీ కాంతర సినిమా KFIపై ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. ఈ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమాలు ఇంకేమైనా వస్తాయా అని ఆడియన్స్ ని ఎదురు చూసేలా చేసింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన కాంతార సినిమా కన్నడ నుంచి మొదలై పాన్ ఇండియా మొత్తం వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయ్యింది. తెలుగులో కాంతార రైట్స్ ని గీతా ఆర్ట్స్ తీసుకోని రిలీజ్ చేసింది. గీతా ఆర్ట్స్ కి కాంతార సినిమాని మంచి లాభాలని తెచ్చిపెట్టింది. ఇదే కోవలో గీత ఆర్ట్స్ 2 నుంచి మరో ఇండస్ట్రీ హిట్ సినిమా తెలుగులో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘2018’.

కేరళలో 2018లో వచ్చిన భయంకరమైన వరదల నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. పులి మురుగన్ బాక్సాఫీస్ లెక్కల్ని బ్రేక్ చేసి, అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది 2018 మూవీ. 2018 సినిమా ఇప్పుడు బౌండరీలు దాటుతూ హిందీ, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో మే 26న రిలీజ్ కానుంది. ఈ మూవీని తెలుగులో గీత ఆర్ట్స్ 2 రిలీజ్ చేస్తోంది. 2018 సినిమా తెలుగు ప్రమోషన్స్ ని కూడా గీత ఆర్ట్స్ 2 గట్టిగానే చేస్తోంది కాబట్టి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి కాంతర స్టైల్ లో 2018 కూడా వైల్డ్ ఫైర్ లా ఇతర రాష్ట్రాల బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందేమో చూడాలి.

Exit mobile version