జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తి.. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గౌహతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరుగుతుంటుండగా భార్య గరిమా సైకియా గార్గ్ ఏడుస్తూనే కనిపించారు. అస్సామీ మహిళలు ధరించే సాంప్రదాయ దుస్తులైన మేఖేలా చాదర్ ధరించారు. చితికి మంటలు అంటుకుంటున్న సమయంలో రెండు చేతులు జోడించారు. ఎక్కి.. ఎక్కి ఏడుస్తూనే కనిపించారు. పలువురు ఆమెను ఓదార్చుతూ కనిపించారు.
మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే?
సౌత్ దర్శకులంటే నార్త్ స్టార్లకు చిన్న చూపా. వీళ్లు చెప్పినప్పుడు షూట్ చేయడానికి, ఆడిందే ఆడగా, పాడిందే పాటగా హిందీ డైరెక్టర్ల తలాడించినట్లు సదరన్ డైరెక్టర్లు చేయడం లేదా. అందుకే బీటౌన్ హీరోస్ సౌత్ డైరెక్టర్లకు మధ్య సరైన బాండింగ్ బిల్డ్ కావడం లేదా. అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యుయేషన్. మొన్న సికిందర్ ప్లాప్ వెనుక సల్మానే రీజన్ అని కుండబద్దలు కొట్టాడు మురుగుదాస్. అలాగే అమీర్ ఖాన్- లోకేష్ కనగరాజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి పట్టాలెక్కాల్సిన ప్రాజెక్ట్ ట్రాక్ తప్పింది. హీరోలే చేయాలా నేనేందుకూ చేయకూడదనుకుందేమో దీపికా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్లతో పేచీలు పెట్టుకొని వెళ్లిపోయింది.
బేబీ బంప్ ఫొటోతో.. గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ స్టార్ కపుల్
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారని అధికారికంగా వెల్లడించారు. కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుని, వారి జీవితంలో కొత్త, అందమైన అధ్యాయం ప్రారంభమవుతుందని అభిమానులకు తెలియజేశారు. కొన్ని సంవత్సరాల ప్రేమ ప్రయాణం అనంతరం, కత్రినా.. విక్కీ 2021లో వివాహం చేసుకున్నారు. అప్పటినుండి కత్రినాకు తల్లి కావడం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆమె కొన్ని సందర్భాల్లో లూజ్ వస్త్రధారణలో ఫోటోలు పంచుకున్నప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. ఈ జంట పలు ఇంటర్వ్యూలో, “ఇలాంటి శుభవార్త ఉంటే మేమే స్వయంగా మీతో పంచుకుంటాం. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయాన్ని వెల్లడిస్తాం” అని వెల్లడించారు. ఇప్పుడు మొత్తానికి వారు అధికారికంగా ఈ వార్త పంచడంతో, అభిమానులు, సినీ ప్రముఖులు జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జగన్‌కు మిథున్‌రెడ్డి సోదరుడి లాంటి వారు.. కొమ్మలు నరికితే చెట్టు బలహీనపడుతుందనే అరెస్ట్..!
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడి లాంటివారు.. ఎప్పుడూ నేనున్నానంటూ.. వెంటే ఉంటారని.. ఆ కక్ష తోనే కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది.. కొమ్మలను నరికిస్తే చెట్టు బలహీనమవుతుందనే మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని ఆరోపించారు మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్. ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో మదనపల్లి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, వైసీపీ నేతలు మేకా శేషుబాబు, మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్ షేక్ నజీర్ హమీద్ ములాఖాత్ లో కలిశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ.. కొమ్మలను నరికేస్తే చెట్టు బలహీనమవుతుందనే మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే ప్రజలకు సేవ చేసే కుటుంబమని, వారికంటే ప్రజలకు మీరు సేవ చేసి చూపించండి అని సవాల్ చేశారు.
మెక్సికోలో కూలిన విమానం.. ప్రముఖ టీవీ హోస్ట్ డెబోరా ఎస్ట్రెల్లా మృతి
విమాన ప్రమాదంలో ప్రముఖ మెక్సికన్ టీవీ హోస్ట్ డెబోరా ఎస్ట్రెల్లా(43) హఠాన్మరణం చెందింది. విమాన ట్రైనింగ్ పొందుతుండగా ఈ ఘోరం జరిగింది. తక్కువ ఎత్తులోనే విమానం ఎగురుతుండగానే కూలిపోయింది. పార్క్ ఇండస్ట్రియల్ సియుడాడ్ మిత్రాస్‌పైకి దూసుకెళ్లినట్లు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. డెబోరా ఎస్ట్రెల్లా 2018 నుంచి మల్టీమీడియో టెలివిజన్‌లో పని చేస్తోంది. అయితే ఆమె న్యూవో లియోన్‌లో విమాన ట్రైనింగ్ పొందుతోంది. శనివారం ట్రైనింగ్ పొందుతుండగా విమానం తక్కువ ఎత్తులోనే ఉంది. అయితే ఉన్నట్టుంగా వేగంగా నేలపైకి దూసుకొచ్చి కూలిపోయింది. దీంతో ట్రైనర్ బ్రయాన్ లియోనార్డో బాలేస్టెరోస్ అర్గుటాతో పాటు డెబోరా ఎస్ట్రెల్లా మరణించారు.
స్మగ్లింగ్ ఆరోపణలు.. దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లపై కస్టమ్స్ దాడులు
కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) కేరళ వ్యాప్తంగా భారీ దాడులను ప్రారంభించింది. భూటాన్ నుంచి లగ్జరీ వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు అనుమానిస్తూ, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ అధికారుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొచ్చిలోని మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కూడా అధికారులు విచారణ చేశారు. ‘ఆపరేషన్ నమ్‌ఖోర్’ (భూటాన్ భాషలో వాహనం) పేరుతో కేరళ అంతటా కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం, కుట్టి పురం, త్రిస్సూర్ సహా దాదాపు 30 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. అధికారులు భూటాన్ నుంచి హై-ఎండ్ లగ్జరీ SUVలు ల్యాండ్ క్రూయిజర్లు, ప్రాడో, ల్యాండ్ రోవర్లు వంటి వాహనాలను అక్రమంగా భారత్‌లోకి దిగుమతి చేసుకున్నారని అనుమానిస్తున్నారు. భూటాన్‌లో ఈ వాహనాలను మొదట రూ.5 లక్షలకంటే తక్కువ ధరలో కొనుగోలు చేస్తారు. ఆపై కేరళ నంబర్ ప్లేట్‌తో రీమోడల్ చేసి, దాదాపు రూ.40 లక్షల వరకు అమ్ముతారు. అసలు ధర కోట్లలో ఉండే ఈ వాహనాలను పన్నులు చెల్లించకుండా విక్రయించడం వలన పన్ను చెల్లింపు తప్పులు జరుగుతున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు.
100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి.. వారి సంప్రదాయాలు, విశ్వాసాల మేరకే ఆలయ నిర్మాణం!
మేడారంలో శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ఆలయ అభివృద్ధి, విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్‌లను అధికారులు పూజారులకు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. ఈ ప్రణాళికలపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం, వారి ఏకాభిప్రాయం పొందిన తర్వాతనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. మేడారంలో ఆలయ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివాసీల సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆదివాసీలు దేశానికి మూలవాసులని, వారి సంప్రదాయాలు, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని.. వారి సంప్రదాయంలో ఏమాత్రం మార్పు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అమానుషం.. తాలిబన్ల పాలనపై విమర్శలు
కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో షరియా చట్టం అమలు చేస్తున్నారు. ఈక్రమంలో తాలిబన్ల ప్రభుత్వం దేశంలో అనేక అమానుష చర్యలకు పాల్పడుతుందని, మానవ హక్కుల సంస్థలు, UN నుంచి వ్యతిరేకత వస్తుంది. తాలిబన్ల చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవని, అవి అమానవీయమైనవిగా ఉన్నాయని అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అయిన్పటికీ ఆప్ఘన్‌లో తాలిబన్లు ఈ శిక్షలను కొనసాగిస్తున్నారు. తాజాగా నివేదికల ప్రకారం.. గత నెలలో తాలిబన్లు దేశవ్యాప్తంగా 114 మందిని బహిరంగంగా కొరడాతో శిక్షించారని, ఈ శిక్షను అనుభవించిన వారిలో 20 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం.
దేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కామ్.. వృద్ధుడి టార్గెట్ చేసిన మహిళ.. రూ.23 కోట్లు స్వాహా..!
గత కొన్ని ఏళ్లుగా దేశవ్యాప్తంగా అనేక డిజిటల్ అరెస్టు కేసులు వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ కేసు ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ కేసు పోలీసులను, దర్యాప్తు సంస్థలను కూడా ఆశ్చర్యపరిచింది. దక్షిణ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్‌లో నివసించే రిటైర్డ్ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా దీనికి బలయ్యాడు. ఈ వృద్ధుడిని ఏకంగా నెలకు పైగా అరెస్టు చేశారు. అతడు జీవితాంతం పొదుపు చేసిన 23 కోట్ల రూపాయలు దోచుకున్నారు. వృద్ధుడైన నరేష్ మల్హోత్రాకు దక్షిణ ఢిల్లీలోని గుల్మోహర్ పార్క్‌లో ఒక భవనం ఉంది. అందులో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. మరో ఇద్దరు కుమారులు విడివిడిగా నివసిస్తున్నారు. నరేష్‌కి నలుగురు మనవరాళ్ళు కూడా ఉన్నారు. అతని భార్య చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. మాజీ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన శస్త్రచికిత్స చేయించుకుని జూలై 4న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు, ఎయిర్‌టెల్ ప్రధాన కార్యాలయం పేరుతో ఒక మహిళ కాల్ చేసింది. తన ల్యాండ్‌లైన్ నంబర్ హ్యాక్ చేశారని, ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ముంబైలో ఒక నంబర్ తీసుకున్నట్లు తెలిపింది. తన ఆధార్ నంబర్‌ను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారని, ఈ ఖాతాల ద్వారా పుల్వామా కేసులో ఉగ్రవాదులకు ₹1,300 కోట్ల నిధులు సమకూర్చారని ఆమె చెప్పింది.
గ్రూప్-1 తీర్పుపై హైకోర్టులో మరోసారి అప్పీల్ దాఖలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించిన గ్రూప్-1 నియామకాలపై కొనసాగుతున్న వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీలు చేసిన నేపథ్యంలో, తాజాగా గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు. మార్చి 10న విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని పరిశీలించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, ఈ నెల 9న కీలక తీర్పు ఇచ్చారు. ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు, మార్కుల జాబితాను రద్దు చేశారు. ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ వాదనలను సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటూ డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. ఫలితాలు సక్రమంగానే ఉన్నాయని, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలులోకి వస్తే నియామక ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని టీజీపీఎస్సీ వాదిస్తోంది.
