Site icon NTV Telugu

Top Hedlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కాంతారా -1 మలయాళ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ హీరో

కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాను జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా కు ప్రీక్వెల్ గా కాంతారా చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు. అందుకు హోంబలే భారీగా ఖర్చు పెడుతోంది.

మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ.. 9న ‘అన్నదాత పోరు’

మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈనెల 9వ తేదీన వైసీపీ ‘అన్నదాత పోరు’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది.. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది.. ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది.. ‘అన్నదాత పోరు’ పోస్టర్‌ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఈ నెల తొమ్మిదవ తేదీన రైతుల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు..

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు అస్వస్థత..

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్‌ సూద్‌ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్‌ సూద్‌ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. నిన్న శ్రీశైలం వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు ప్రవీణ్ సూద్. జూబ్లీహిల్స్ లోని సిబిఐ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సీబీఐ గెస్ట్ హౌస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహా గణపతి..

హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారులన్నీ గణపయ్య విగ్రహాలతో హుస్సేన్ సాగర్ వైపు పయనమయ్యాయి. గణపయ్య భక్తులు ఆటపాటలతో శోభాయాత్రాలో పాల్గొంటున్నారు. గణేష్ నిమజ్జనం వేళ నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. నగరంలో అత్యంత విశిష్టత కలిగిన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఈ ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొనగా బడా గణేషుడు హుస్సేన్ సాగర్ కు తరలివెళ్లాడు.

తిరుమల వెళ్తున్నారా..? శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్..

మీరు తిరుమల వెళ్తున్నారా..? శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా? అయితే, ఇది మీ కోసమే.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని రేపు 12 గంటల పాటు మూసివేయనుంది టీటీడీ. ఆలయంలో 15 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనుంది. మరోవైపు అన్న ప్రసాద సముదాయాన్ని కూడా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు మూసి వేయనుంది టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను రద్దు చెయ్యగా.. ఎల్లుండి సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

SIIMA లో నాలుగు అవార్డులు దక్కించుకున్న.. కల్కి 2898 AD

దక్షిణ భారత సినిమా మరోసారి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకుంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 ఈసారి దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్‌పో సిటీలో ఘనంగా నిర్వహించబడింది. లైట్ల తళుకులు, గ్లామర్, సంగీతం, డ్యాన్స్‌లతో స్టార్ పవర్ నిండిన ఈ వేడుకలో దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒకచోట చేరారు. మొదటి రోజు ప్రత్యేకంగా తెలుగు సినిమాకి అంకితం చేయబడింది. టాలీవుడ్‌కి చెందిన నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, అభిమానులు అందరూ ఈ వేదికపై కలుసుకుని సినీ విజయాలను జరుపుకున్నారు.

జైన ఉత్సవంలో కంత్రీ దొంగ.. కోటి విలువైన బంగారు వస్తువులు అపహరణ

దేశ రాజధాని ఢిల్లీలో ఓ కంత్రీ దొంగ కోటికి పైగా విలువైన బంగారు కలశాలను ఎత్తుకెళ్లిపోయాడు. ఎవరికి అనుమానం రాకుండా పూజారి వేషంలో వచ్చి పాత్రలను ఎత్తుకెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ‌లో రికార్డ్ అయ్యాయి. ఎర్రకోటలో జైన ఉత్సవం జరిగింది. భక్తులంతా ఉత్సవ సందడిలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన ఓ కంత్రీ దొంగ.. పూజారి వేషంలో వచ్చి రూ.1.5 కోట్ల విలువైన రెండు బంగారు కలశాలను ఎత్తుకెళ్లిపోయాడు. ఇతర పెద్ద వస్తువులను కూడా అపహరించుకునిపోయాడు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంంటామని హామీ ఇచ్చారు.

ఆ యుద్ధాన్ని ఆపడం ఈజీ అనుకున్నా.. తర్వాతే అర్థమైంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

యుద్ధాలపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలపై రోజుకో మాట మారుస్తున్నారు. గురువారం టెక్ సీఈవోలతో భేటీ అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మూడు యుద్ధాలను ఆపానంటూ చెప్పుకొచ్చారు. తాజాగా అమెరికా కాంగ్రెస్‌ సభ్యులకు వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఏడు యుద్ధాలను తానే ఆపానంటూ మరోసారి డబ్బా కొట్టుకున్నారు. కాకపోతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయానన్నారు. ఈ యుద్ధాన్ని ఆపడం ఈజీ అనుకున్నా కానీ.. ఆపలేకపోయాయని చెప్పుకొచ్చారు.

డిప్యూటీ సీఎంపై మహిళా ఎంపీ విమర్శలు..

షోలాపూర్‌లో మహిళా ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణను ఫోన్‌లో బెదిరించారనే ఆరోపణలతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆ వీడియోపై విమర్శలు గుప్పించారు. మహిళా గౌరవంపై పవార్ చేసిన ప్రకటన, ఐపీఎస్ అధికారిపై దర్యాప్తు జరపాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి చేసిన డిమాండ్ పరస్పర విరుద్ధమని ఆమె అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మహిళా ఐపీఎస్ అధికారిణి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఇటీవల వైరల్ అయిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ సందర్భంలో, శివసేన (యుబిటి) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసు అధికారుల గౌరవం గురించి పవార్ చేసిన ప్రకటనకు, ఆయన పార్టీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి చర్యకు మధ్య ఉన్న వైరుధ్యం గురించి ఆమె ప్రశ్నలు లేవనెత్తారు.

ఆకస్మికంగా ట్యాంక్‌బండ్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

గణేష్‌ నిమజ్జన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ట్యాంక్‌బండ్‌ వద్ద ప్రత్యక్షమయ్యారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా చేరుకున్న ఆయన, ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండానే సామాన్యుల మధ్య నిలబడి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆకస్మికంగా సీఎం ప్రత్యక్షం కావడంతో అక్కడి అధికారులు, పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సాధారణ పౌరుడిలా వ్యవహరిస్తూ నిమజ్జన ప్రక్రియను దగ్గరగా పరిశీలించిన సీఎం రేవంత్, అధికారులను పలుమార్లు ప్రశ్నించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, శుభ్రత, ప్రజల రాకపోకలపై ఆయన సూచనలు చేశారు.

 

Exit mobile version