కాపీరైట్ కేసులో ఊరట
గ్రామీ, ఆస్కార్ విజేత మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహ్మాన్‌కు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. 2023లో మణి రత్నం డైరెక్టర్‌గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాలోని ‘వీర రాజా వీర’ పాటపై వచ్చిన కాపీరైట్ ఉల్లంఘన కేసులో సింగిల్ జడ్జి బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. జస్టిస్‌లు సి. హరి శంకర్, ఓం ప్రకాశ్ శుక్లా ఉన్న ఈ బెంచ్, రహ్మాన్ అప్పీల్‌ను అనుమతించడంతో పాటు, “కాపీరైట్ ఉల్లంఘన అంశాన్ని ఇంకా పరిశీలించలేదు” అని స్పష్టం చేసింది.
“ఇది అమెరికా కాదు.. భారత్”.. హైకోర్టులో ఎక్స్(ట్వీటర్)కు భారీ ఎదురుదెబ్బ..!
కర్ణాటక హైకోర్టులో ఎక్స్ (గతంలో ట్విట్టర్)కు ఎదురుదెబ్బ తగిలింది. ప్లాట్‌ఫారమ్‌లోని కొన్ని ఖాతాలు, పోస్ట్‌లను బ్లాక్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ ఎక్స్(గతంలో ట్వీటర్) దాఖలు చేసిన పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. భారతదేశంలో పనిచేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు దేశ చట్టాలను పాటించాలని జస్టిస్ ఎం. నాగప్రసన్న స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియాను నియంత్రించడం అవసరమని, కంపెనీలు నియంత్రణ లేకుండా పనిచేయడానికి అనుమతించలేమని కోర్టు పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మా దేశ పౌరులకు మాత్రమే వాక్ స్వాతంత్య్రాన్ని రక్షిస్తుందని, విదేశీ కంపెనీలు లేదా పౌరులకు ఈ ఆర్టికల్ వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది అమెరికా కాదు.. భరత్.. యూఎస్ ఆలోచనను భారతదేశానికి వర్తించవని కోర్టు తెలిపింది.
పాపం యూనస్..! అమెరికా సాక్షిగా ఘోర అవమానం..
బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్‌కు అగ్రరాజ్యం సాక్షిగా ఘోర అవమానం ఎదురైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్ చేరుకున్న యూనస్ బృందంపై పలువురు గుడ్లతో దాడి చేశారు. అలాగే ఆయన గత మూడు రోజులుగా న్యూయార్క్‌లో ఒక్క ప్రముఖ నాయకుడిని కూడా కలవలేకపోయాడు. ముస్లిం దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్‌ను కూడా ఒంటరిని చేశాయనే వాదనలు వినిస్తున్నాయి.
నువ్వు మారవా ఎర్డోగాన్.. ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశం..
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ‘‘కాశ్మీర్’’ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తారు. పలు సందర్భాల్లో ఎర్డోగాన్ భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడారు. తాజాగా, మరోసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ( UNGA ) వార్షిక సమావేశంలో కూడా కాశ్మీర్ అంశంపై మాట్లాడారు. ‘‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, మా కాశ్మీరీ సోదరులు, సోదరీమణుల ఆకాంక్షల ఆధారంగా సంభాషణ ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని మేము సమర్థిస్తున్నాము’’ అని అన్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌పై సిట్- సీఐడీ సంచలన ఆపరేషన్
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను అణిచివేయడంలో భాగంగా సిట్–సీఐడీ భారీ స్థాయి ఆపరేషన్ చేపట్టింది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపి ఎనిమిది మంది ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. దర్యాప్తులో భాగంగా Taj0077, Fairplay.live, Andhra365, Vlbook, Telugu365, Yes365 అనే ఆరు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై విచారణ కొనసాగుతోంది. ఈ యాప్‌ల ద్వారా అంతర్రాష్ట్ర స్థాయిలో భారీగా బెట్టింగ్ బిజినెస్ నడుస్తోందని అధికారులు గుర్తించారు. సోదాల్లో పలు హార్డ్‌వేర్ పరికరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, కొన్ని బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు బయటపడగా, మిగిలిన నిందితుల కోసం సిట్ ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌తో దేశవ్యాప్తంగా నడుస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఓజీ కమింగ్ సూన్.. లీక్ చేస్తామంటూ IBomma హెచ్చరిక
మరికొద్ది గంటల్లో ఓజీ ప్రీమియర్స్ పడతాయి. అనగా, టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న పైరసీ సైట్ ఐ బొమ్మ (బప్పాం) ఒక సంచలన పోస్టర్ షేర్ చేసింది. ఓజీ కమింగ్ సూన్ అంటూ తమ వెబ్‌సైట్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పోస్టర్ షేర్ చేసింది. వాస్తవానికి, ఈ వెబ్‌సైట్ కొన్ని రోజుల క్రితం వరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్స్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్‌లో పెడుతూ వచ్చేది. కానీ, కొద్ది రోజుల క్రితం నుంచి టాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాల థియేటర్ లేదా హెచ్‌డి ప్రింట్‌ను సైతం పైరసీ చేసి రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాను కూడా లీక్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది.
‘‘భారత్ ఒక సూపర్ పవర్’’..ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ప్రశంసలు..
ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. రష్యా, చైనాల నుంచి భారత్‌ను వేరే చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ‘‘సూపర్ పవర్’’గా కొనియాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు, శాంతి చర్చల్లో భారత పాత్రను నొక్కి చెప్పారు. సాంకేతికత-వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్-ఫిన్లాండ్ సంబంధాలు బలోపేతం అవుతాయని అన్నారు. బ్లూమ్‌బెర్గ్ పాడ్‌కాస్ట్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. స్టబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం యూరోపియన్ యూనియన్, అమెరికాకు సన్నిహిత మిత్రదేశం అని అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న సూపర్ పవర్. దాని జనాభా, దాని ఆర్థిక వ్యవస్థ దానికి కారణం. వెస్ట్రన్ దేశాలు భారత్‌తో సన్నిహితంగా మెలగడం చాలా ముఖ్యం’’ అని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ముందుగా కాల్పుల విరమణ అవసరమని, ఆ తర్వాతే జెలెన్స్కీ, పుతిన్ మధ్య సమావేశం, శాంతి చర్చలు ప్రారంభించగలమని స్టబ్ పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం వచ్చేవరకు ధర్నా ఆగదు.. వచ్చే నెల 10వ తేదీకి వస్తాన్న పవన్ కల్యాణ్..!
కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన విరమించారు. వచ్చే నెల10వ తేదీన పవన్ కల్యాణ్ వస్తారని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఆ సమావేశంలోపు పరిష్కార మార్గాలుపై అధికారులతో చర్చించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారన్నారు. పవన్ వచ్చేంత వరకు ఈ 16 రోజులు తాము వేటకు వెళ్ళమని మత్స్యకారులు తేల్చిచెప్పారు. అప్పటికి డిప్యూటీ సీఎం రాకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతున్నట్లు ఉప్పాడ మత్స్యకారులు చేపట్టిన ఆందోళన, వారి సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. నిరసనకారులు మొండి పట్టుపట్టడంతో వచ్చే నెల 10 తేదీన వస్తానని చెప్పారు.
వానలకు వేళాయరా.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ..
తెలుగు రాష్ట్రాలను వరస వర్షాలు విడవకుండా కురుస్తున్నాయి. గ్యాప్‌ల వారీగా విరుచుకుపడుతున్న వర్షాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా వాయుగుండం ముప్పు ముంచుకొస్తుందని హెచ్చరించింది. రేపు, 26న, బంగాళాఖాతంలో ఏర్పడే ఈ వాయుగుండం బలపడుతూ 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. 26 నుంచి 29 వరకు రాష్ట్రంలో చాలా తక్కువగా ఉండకపోయే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా హెచ్చరిస్తోంది.
మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. దాచిపెడుతున్న పోలీసులు..?
విజయవాడ కొత్తపేట పోలీసుల నిర్లక్ష్యం బట్టబయలైంది. విజయవాడ పంజా సెంటర్ దగ్గర మతిస్థిమితం లేని అమ్మాయిని అర్ధరాత్రి యువకుడు రేప్ చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకులు రేప్ చేసిన మతిస్థిమితం లేని అమ్మాయిని విజయవాడ స్వరంగం దగ్గర పడేశారు. ప్రస్తుతం ఆ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ అంశం బయటకు రాకుండా టూ టౌన్ సీఐ కొండలరావు గోప్యంగా ఉంచుతున్నారు. కనీసం నిందితుడిపై కేసు నమోదు చేశారా? లేదా అనే విషయంపై కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఫోన్‌లో సైతం అందుబాటులోకి రాకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సీఐ కొండలరావు. నిందితుడిని గుర్తించారా? అరెస్ట్ చేశారా? అనే అంశంపై క్లారిటీ లేదు. మతిస్థిమితం లేని అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సమాచారం కూడా లేదు. పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ ఈ అంశాన్ని బయటకు రాకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకున్నారనే అంశంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
