ఆపిల్ iPhone 17 సిరీస్ లాంచ్.. ఏ ఫోన్ ఎంతకు లభిస్తుందంటే?
ఆపిల్ (Apple) సంస్థ ప్రకటించిన iPhone 17 సిరీస్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ వివిధ శ్రేణిలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. మరి ఈ మొబైల్స్ మోడల్ ధరలు, స్టోరేజ్ ఆప్షన్స్, రంగులు, ప్రీ-ఆర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి. iPhone 17 ధర అమెరికాలో 256GB స్టోరేజ్ వెరియంట్ $799 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ మొబైల్ లో 512GB స్టోరేజ్ వెరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది భారతదేశంలో రూ.82,900గా నిర్ణయించబడింది. ఈ ఫోన్ లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్, వైట్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. వీటికి సంబంధించి ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 12 నుండి ప్రారంభమై, సెప్టెంబర్ 19 నుండి గ్లోబల్ స్థాయిలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ది రాజా సాబ్ మ్యూజికల్ జర్నీ మొదలు.. ఫస్ట్ సింగిల్ డేట్ ఔట్”
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతి సినిమా పట్ల అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన, ప్రస్తుతం దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది రాజా సాబ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హారర్, ఫాంటసీ, ఎంటర్‌టైన్‌మెంట్ వస్తున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే మరో వినూత్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చి అభిమానుల్లో ఎక్సయిట్‌మెంట్ పెంచేశారు.
పక్క దారి పడుతున్న యూరియా.. పట్టుకున్న రైతులు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) నుంచి రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తున్న ఘటన బహిర్గతమైంది. రైతులు చెబుతున్న వివరాల ప్రకారం, సంఘం నుంచి అక్రమంగా యూరియా బస్తాలను వాహనంలో తరలిస్తున్న దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ వాహనాన్ని స్థానిక రైతులు అడ్డగించి పట్టుకున్నారు. అయితే, యూరియా తరలింపుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడం, ఓటిపి లేకుండా బస్తాలను తరలించడం రైతుల్లో ఆగ్రహం రేపింది.
చిన్ననాటి కష్టాలే జీవిత పాఠాలు.. రకుల్ ఎమోషనల్ కామెంట్స్
ఫిట్‌నెస్ క్వీన్‌గా, గ్లామరస్ హీరోయిన్‌గా, సీరియస్ పెర్ఫార్మర్‌గా మూడు కోణాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ఆమె, ఇటీవల తన బాల్యం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఆర్మీ నేపథ్యమున్న కుటుంబంలో పెరిగిన రకుల్ చిన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలకు మారాల్సి వచ్చిందట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను బాల్యంలో దాదాపు 10 పాఠశాలలు మారాను. అదే అనుభవం నాకు జీవితంలో ఎక్కడికెళ్లినా సర్దుకుపోయే గుణం ఇచ్చింది. కొత్త సంస్కృతులు, కొత్త వ్యక్తులతో చాలా త్వరగా కలిసిపోయే అలవాటు ఏర్పడింది. ఇవే నేటి రకుల్‌గా నిలబడటానికి నాకు తోడ్పడ్డాయి” అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా, సినిమా షూటింగ్‌ల కారణంగా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కూడా ఒంటరితనం అనిపించదని రకుల్ చెప్పింది. “కుటుంబ సభ్యులు మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే బాల్యం నుంచే ధైర్యం, బలమైన మనస్తత్వం, స్వతంత్రంగా నిలబడే నైపుణ్యం నేర్చుకున్నాను. ఆ అనుభవాలే నన్ను ఈ రోజు ప్రతి పరిస్థితిలో బలంగా నిలబడేలా చేశాయి” అంటూ ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం రకుల్ అజయ్ దేవగణ్‌తో కలిసి ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంతో బిజీగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే ‘మేరే హస్బెండ్ కీ బివీ’తో ప్రేక్షకులను అలరించిన ఆమె, మరోసారి పెద్ద హిట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. మొత్తానికి, రకుల్ చిన్ననాటి అనుభవాలు కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాకుండా, జీవిత పాఠాలు గా మారి ఆమెను మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మంచి స్నేహితుడైన మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా
ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైన సంబంధంగా అభివర్ణించారు. వాణిజ్యం విషయంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని.. అందుకు తాను సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాబోయే వారాల్లో మంచి స్నేహితుడైన భారత ప్రధాని మోడీతో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య విజయవంతమైన ముగింపు రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కచ్చితంగా భావిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 5న కూడా మోడీ ఎల్లప్పుడూ స్నేహితుడిగా ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రత్యేక సమయంలో ఏమి చేస్తున్నారో తనకు నచ్చడం లేదన్నారు. ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి ఉండడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నేడు అనంతలో సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మొదటిసారి భారీ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇవాళ (సెప్టెంబర్ 10న) అనంతపురం వేదికగా సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. గత 15 నెలల్లో రాష్ట్రంలో అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ సభను సిద్ధం చేశారు. ఇక, ఈ సభలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఇతర మంత్రులు హాజరుకానున్నారు. అయితే, ఒకే వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చునేలా తగిన ఏర్పాట్లను రెడీ చేశారు.
యూపీఐ లావాదేవీలపై పరిమితులను సవరించిన NPCI
యూపీఐ లావాదేవీ పరిమితులను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరోసారి సవరించింది. బీమా ప్రీమియం, స్టాక్ మార్కెట్లు, క్రెడిట్ కార్డు బిల్లుల లాంటి విభాగాలకు యూపీఐ ద్వారా చెల్లించే ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 15వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొనింది. ఇక, ఈ తేదీ నుంచి 24 గంటల్లో చేసే మొత్తం లావాదేవీల పరిమితిని సైతం వేర్వేరు విభాగాల్లో రూ.10 లక్షల వరకు పెంచేసింది. ఎన్‌పీసీఐ ప్రకటనతో.. సవరించిన పరిమితులు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్, ప్రయాణ, వ్యాపార/మార్చంట్ సంబంధిత లావాదేవీలకు మాత్రం రూ.5 లక్షల పరిమితి వర్తించనుంది.
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియామకం
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియమితులయ్యారు. రక్షణ మంత్రిగా ఉన్న సెబాస్టియన్‌ను కొత్త ప్రధానిగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నియమించారు. ఫ్రాంకోయిస్ బేరో ప్రధాని పదవికి రాజీనామా చేయగానే.. సెబాస్టియన్ లెకోర్నును ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ నియమించారు. జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఫ్రాంకోయిస్ బేరో ఓటమి పాలయ్యారు. దీంతో ప్రధాని పదవికి ఫ్రాంకోయిస్ బేరో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫ్రెంచ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇలాంటి తరుణంలో సెబాస్టియన్ లెకోర్ను కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఈయనపై చాలా బాధ్యతలు ఉన్నాయి. విభజించబడిన పార్లమెంట్‌ను ఏకం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో 2026 బడ్జెట్‌ను సెబాస్టియన్ లెకోర్ను ఆమోదించాల్సి అవసరం ఉంది. కొత్త ప్రధాని ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు నడిపిస్తే బాగానే ఉంటుంది. లేదంటే ఇప్పటికే రెండేళ్లకే ఇద్దరు ప్రధానులు మారారు. సరిగ్గా చేయకపోతే లెకోర్నుకు కూడా ఇబ్బందులు తప్పవు.
ఇంతలోనే అంత మార్పా.. షాక్ ఇచ్చిన అమీర్ ఖాన్ కొత్త లుక్
బాలీవుడ్‌లో నటులు తమ పాత్రల కోసం శరీరంలో భారీ మార్పులు చేయడం సాధారణమే. అయితే ఈ మార్పులు కొన్నిసార్లు వారి కెరీర్‌ను ప్రభావితం చేస్తాయి కూడా. ఒకప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టి ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగి తర్వాత తగ్గేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. అలానే ఇప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకున్నాడు అమీర్ ఖాన్. ఇటీవల ‘సితారే జమీన్ పర్’ సినిమాలో యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపించిన అమీర్, రజనీకాంత్ కూలీలో తన స్టైల్‌తో మెప్పించాడు. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన లుక్‌తో షాక్ ఇచ్చాడు. కారణం ఆయన చేస్తున్న కొత్త ప్రాజెక్ట్. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో అమీర్, భారతీయ సినీ పితామహుడు ఫాల్కే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన బరువు పెరిగి కొత్త లుక్‌లో రెడీ అయ్యాడు. ఈ ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం అమీర్ ఖాన్ అనేక స్క్రిప్టులు పక్కన పెట్టాడని బాలీవుడ్ టాక్. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించబోయే రజనీకాంత్–కమల్ హాసన్ మల్టీస్టారర్ తర్వాత అమీర్‌తో సినిమా చేయాలనుకున్నా, అది వాయిదా పడిందని సమాచారం. అయితే అమీర్ కెరీర్ మొత్తంలో పాత్రల కోసం ఎంత కష్టమైనా భరించి, కొత్త ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. ఈసారి కూడా అదే ధైర్యంతో ముందుకెళ్తున్నాడు. అభిమానులు మాత్రం – “అమీర్ కష్టాలు ఎప్పుడూ వృథా కావు, ఈసారి కూడా తప్పకుండా సక్సెస్ అందుకోవాలి” అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బిర్యానీలో బొద్దింక.. షాకైన బిర్యానీ లవర్.. ఎక్కడంటే…
చాలామందికి బిర్యానీ అంటే చాలా ఇష్టముంటుంది. అదే హైదరాబాదీ బిర్యానీ గురించి ఐతే.. అసలు చెప్పాల్సిన పనే లేదు. బిర్యానీ కోసం ఎక్కడినుంచో హైదరాబాద్ కు వచ్చి తింటుంటారు. దీన్నే కొందరు హోటల్ నిర్వాహాకులు క్యాష్ చేసుకుంటున్నారు. శుచి, శుభ్రత, నాణ్యత మరిచిపోతున్నారు. కొన్ని సార్లు బిర్యానిలో కప్పలు,పాములు, తేళ్లు, బళ్లులు వస్తున్నాయి. ఇలాంటివి జరుగుతున్న కొందరు హోటల్ నిర్వాహాకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని పలు హోటల్లు, రెస్టారెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికి కొన్ని హోటల్లు, రెస్టారెంట్లో తీరు మాత్రం మారడం లేదు. ఫుడ్ తినేందుకు వెళ్లిన కస్టమర్స్ కు వింత పరిణామాలు ఎదురువుతున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులు చేసిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా… ఓ వ్యక్తికి బిర్యానీలో బొద్దింక రావడం చూసి ఒక్కసారిగా కంగుతున్నాడు.
హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ పునరాలోచన.. రీవాల్యుయేషన్ సవాల్ చేసే యోచన
హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లో కలవరం సృష్టిస్తోంది. గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కమిషన్ పునరాలోచనలో పడింది. ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని TGPSC యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.మంగళవారం నాడు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమై ఈ అంశంపై లోతుగా చర్చించారు. మరోసారి మూల్యాంకనం చేస్తే ఎదురయ్యే సమస్యలు, దాని వల్ల కలిగే ఇబ్బందులపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ప్రక్రియ వల్ల సమయం వృథా అవడంతో పాటు, కొత్త వివాదాలు తలెత్తే అవకాశం ఉందని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.
