Site icon NTV Telugu

Tollywood : టాలీవుడ్ యంగ్ లవ్ కపుల్స్.. పెళ్లి పీటలు ఎక్కుతారా?

Tollywood

Tollywood

టాలీవుడ్ స్టార్స్ కొందరు తమ లవ్ ట్రాక్స్ బయటపెట్టేస్తున్నారా అంటే అవుననే వినిపిస్తున్నాయ్. కాదు కాదు కనిపిస్తున్నాయ్. రాజ్ నిడమోరుతో- సమంత రిలేషన్లో ఉందని వార్తలు వస్తున్నప్పటికీ ఎప్పుడు ఖండించడం లేదు సామ్. అలాగే అతడితో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ మరింత హింట్ ఇస్తోంది బ్యూటీ. ఇక విజయ్- రష్మిక సంగతి చెప్పనక్కర్లేదు. ప్రేమలో ఉన్నామని చెప్పరు. కానీ ఓపెన్ మేసెజెస్‌ ఇద్దరు కలిసి రెస్టారెంట్స్, ఫారెన్ ఈవెంట్స్, ట్రిప్స్‌తో సందడి చేస్తూ నెటిజన్లకు ఇవ్వాల్సినంత స్టఫ్ ఇచ్చేస్తుంటారు.

Also Read : Tollywood : మెల్లగా తెలుగు మార్కెట్ లో పాగా వేస్తున్న ఇద్దరు స్టార్ హీరోలు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్‌లో ఒకరైన రామ్ పోతినేని రీసెంట్ సెన్సేషనల్ భాగ్యశ్రీ బోర్సేతో లవ్‌లో పడ్డాడని టాక్. ఇద్దరూ కలిసి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారని లెటెస్ట్ బజ్. ఆమె రాకతో ఆయనలోని లిరిసిస్ట్, సింగింగ్ టాలెంట్స్ బయటకు వచ్చేస్తున్నాయట. ఇక వైష్ణవ్ తేజ్- రీతూ వర్మ ట్రాక్ ఎప్పటి నుండో నడుస్తుందని తెలుస్తోంది. వైష్ణవ్ కాదంటున్నప్పటికీ.. మేం నమ్మడం లేదు దొరా అంటున్నారు ఆడియన్స్. టాలీవుడ్‌లో మరో స్టార్ కపుల్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న వార్త వినిపిస్తోంది. గతంలోనూ వీరి పేర్లు వినిపించినప్పటికీ మరోసారి ట్రెండ్ అయ్యేలా చేశారు ఈ జంట. వాళ్లే ఇచ్చట వాహనాలు నిలపరాదు పెయిర్ సుశాంత్ అండ్ మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో నటించినప్పటి నుండి ఈ రూమర్స్ రాగా, మీనూ మేమిద్దం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ రీసెంట్లీ ఎయిర్ పోర్టులో కనిపించే సరికి మళ్లీ ఈ గాసిప్స్‌కు ఊపిరిపోసినట్లయ్యింది.  మరి ఈ జంటలు తాము ఫ్రెండ్స్ అని చెప్పి అలానే ఉంటారా లేదా పెళ్లి పీటలు వరకు వెళ్తారా అనేది చూడాలి.

Exit mobile version