Tollywood : సినీ కార్మికుల వేతనాల పెంపుపై తాజాగా నిర్మాతల మండలి ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయంపై ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ.2వేలు, అంతకంటే తక్కువ వేతనం ఉన్న వారికి మూడు విడతల్లో వేతనాలు పెంచుతామని ఫిలిం ఛాంబర్ కొద్దిసేపటి క్రితమే నిర్ణయించించింది. ఈ నిర్ణయంపై తాజాగా ఫెడరేషన్ సీరియస్ అయింది. ఈ నిర్ణయం ఫెడరేషన్ సభ్యులను విడదీసే విధంగా ఉందంటూ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ అన్నారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు వేతనాలు పెంచాల్సిందే అంటూ డిమాండ్ చేసింది ఫెడరేషన్. నిర్మాతలు చెబుతున్న దాని ప్రకారం కేవలం 10 సంఘాలకే వేతనం పెంపు ఉంటుందని.. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు ఫెడరేషన్ సభ్యులు.
Read Also : WAR 2 : వార్ 2 రన్ టైమ్ ఫిక్స్.. హిందీకే ఇంపార్టెన్స్
మిగిలిన మూడు సంఘాలైన డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్ లకు వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. నిర్మాతలు పెట్టిన 4 కండీషన్లకు కూడా తాము ఒప్పుకోవట్లేదని తేల్చి చెప్పారు. రేపు ఉదయం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ వద్ద నిరసన తెలియజేస్తామని ప్రకటించారు. సోమవారం ఛాంబర్ మరోసారి పిలిస్తే చర్చల్లో పాల్గొంటామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. దీంతో టాలీవుడ్ వేతనాల సమస్య మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఇంతకు మించి ఇవ్వడానికి ఫిల్మ్ ఛాంబర్ రెడీగా కనిపించట్లేదు. ఇప్పటికే తాము ఎక్కువ ఇస్తున్నామని చెబుతోంది. మరి ఈ నిరసనతో సమస్య ఎటువైపు వెళ్తుందో చూడాలి.
Read Also : Sathya Raj : తలమీద కాలు పెట్టే సీన్.. ప్రభాస్ అలా అన్నాడు
