Tollywood vs Bollywood: ఇక్కడ నో మ్యారీడ్ హీరోయిన్స్.. అక్కడ మాత్రం వండర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొన్ని సార్లు విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తాయి. పెళ్లైన హీరోయిన్స్ కి సౌత్ మేకర్స్ గేట్ క్లోజ్ చేస్తే…. మ్యారీడ్ ఉమెన్స్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు నార్త్ క్రియేటర్స్. పెళ్లైన బ్యూటీస్ కే ఆఫర్స్ ఇస్తూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లైన బ్యూటీస్ కి ఫుల్ డిమాండ్ ఉంది. టాప్ హీరోయిన్స్ గా వాళ్లే చక్ర తిప్పుతున్నారు.దీనికి బెస్ట్ ఎగ్జాపుల్ దీపికా పదుకొనే, అలియా భట్ ,అనుష్క శర్మ. ఈ ముగ్గురు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కని మళ్లీ టాప్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు. సౌత్ ,నార్త్ లో ఎక్కడ ఓ పెద్ద ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన ముందు ఈ ముగ్గురు దగ్గరికి వెళ్తాయి . వీళ్లు కాదంటే మిగత హీరోయిన్స్ ని అప్రోచ్ అవుతారు మేకర్స్ . అంతాల తమ క్రేజ్ ని ఎక్సెటెండ్ చేసుకున్నారు ఈ హాట్ బ్యూటీస్.
కరోనాకి ముందు బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేసిన కత్రినా కైఫ్, కియారా అద్వానీ, తాప్సీ ఇప్పుడు మ్యారిడ్ ఉమెన్స్ గా మారిపోయారు. అయినా వీళ్లకి డిమాండ్ ఎక్కడ తగ్గలేదు. ప్రజెంట్ బాలీవుడ్ లో 4 సినిమాలు చేస్తున్న కియారా సౌత్ లో రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. లాస్ట్ ఇయర్ విజయ్ సేతుపతితో ఓ మూవీ చేసిన కత్రిన ఇప్పుడు 3 సినిమాలకు సైన్ చేసింది. ఈ ఏడాదే పెళ్లి చేసుకున్న తాప్సీ కూడా రెండు హిందీ సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంది.
Also Read
బాలీవుడ్ సీనియర్ లేడీస్ గురించి ఎంత చెప్పిన తక్కువే.ఒక్కప్పుడు వెండితెరపై హిట్ పుట్టించిన ఐశ్వర్య రాయ్, కాజోల్, కరీనా కపూర్,రాణి ముఖర్జీ , విధ్య బాలన్ ఇప్పడు 40 ప్లస్ లో కూడా అదే స్టార్ డం కంటిన్యూ చేస్తున్నారు. సూపర్ సీనియర్స్ అయిన రేఖ,మాధురి ధీక్షిత్ గెస్ట్ రోల్స్ లో కనిపించి కేకపుట్టిస్తున్నారు. నార్త్ లో భారీ బడ్జెట్ సినిమా సెట్ అయితే అందులో సీనియర్ బ్యూటీస్ ని కంపల్సరీ యాడ్ చేసుకుంటున్నారు బీటౌన్ మేకర్స్. కానీ సౌత్ లో ఈ ట్రెండ్ రీవర్స్ లో సాగుతోంది.
కానీ సౌత్ లో పెళ్లైన బ్యూటీస్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు మేకర్స్. ఒకప్పుడు అరడజన్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటే నయనతార ఇప్పుడు ఒకటి ,ఆర సినిమాలకే పరిమితమైంది. గ్లామర్ షో తో ఘాటు పెంచిన కాజల్ సెకండ్ లీడ్ గా నటిస్తుంటే సమంత ,రకుల్ కి సింగిల్ ఆఫర్ కూడా రావడం లేదు. అందుకే ఈ ఇద్దరు బాలీవుడ్ చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో పెళ్లైన బ్యూటీస్ కి ఫుల్ డిమాండ్ ఉంటే సౌత్ లో మాత్రం సింగిల్ ఆఫర్ అందుకోవడానికి నానా పాట్లు పడాల్సి వస్తోంది.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!