NTV Telugu Site icon

Pawan Kalyan: జనసేన దిగ్విజయ భేరి.. మేము సైతం అంటున్న డైరెక్టర్స్

Janasena

Janasena

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇంకోపక్క రాజకీయాలతో సైతం ఆయన బిజీగా ఉన్నారు. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం ఏపీలో జనసేన దిగ్విజయ భేరి సంచలనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ ప్రస్థానం, జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మచిలీపట్నంలో భారీ సభను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. పవన్.. ప్రచారం కోసం సిద్ధంచేసిన వారాహి వాహనంపై సభా ప్రాంగణంకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం మొత్తం జనసేన సైనికులతో కిక్కిరిసిపోయింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా డైరెక్టర్స్ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ ప్రస్థానం, జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆయన గురించి తమ మాటల్లో చెప్పుకొస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు.

Dasara Trailer: బాంచత్.. ఇది నాని నట విశ్వరూపం

సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గరనుంచి కుర్ర డైరెక్టర్ సుజిత్ వరకు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ దిగ్విజయ భేరిని విజయవంతం చేయాల్సిందిగా అభిమానులను కోరుతున్నారు. డైరెక్టర్స్ ముత్యాల సుబ్బయ్య, హరీష్ శంకర్, సుజిత్, సాగర్ కె చంద్ర, భీమినేని శ్రీనివాసరావు, వేణు శ్రీరామ్.. నిర్మాతలు వివేక్ కూచిబొట్ల, దయాకర్ రావు, కళా దర్శకుడు తోట తరణి లాంటివారు పవన్ గురించి చెప్పుకొస్తూ దిగ్విజయ భేరికి బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో బైట్లు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సభలో పవన్ ఏ రేంజ్ లో మాట్లాడి దుమ్మురేపుతాడో చూడాలి.

Show comments