NTV Telugu Site icon

Tollywood top 10: టాలీవుడ్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 10 సినిమాలివే!

Adipurush Pre Release Business

Adipurush Pre Release Business

Tollywood Top 10 Highest Pre Release Business Movies: బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయి పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు తెలుగు లేదా దక్షిణాది సినిమాలు అని మన సినిమాలను పిలిచిన వారే ఇప్పుడు మనది ఇండియన్ సినిమా అని పిలుస్తున్నారు. అలా మన స్థాయి పెరగడమే కాదు మన సినిమాల బడ్జెట్ తద్వారా మన సినిమాల మార్కెట్ లు కూడా భారీగా పెరిగాయి. ఇక ఈ క్రమంలో టాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న సినిమాల విశేషాలు మీకోసం.

Also Read: Adipurush: తెలుగు బుకింగ్స్ ఓపెనే అవ్వలేదు.. కానీ లక్ష టికెట్లు అమ్ముడయ్యాయ్?

తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి స్థానం సంపాదించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పలువురు హాలీవుడ్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా మొత్తం మీద అన్ని భాషల్లో కలిపి 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక రెండో స్థానం బాహుబలి సెకండ్ పార్ట్ దక్కించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా 352 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక మూడవ స్థానంలో ప్రభాస్ హీరోగా సుజిత్ సింగ్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన సాహో సినిమా నిలిచింది. ఆ సినిమా 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక తర్వాత స్థానంలో ప్రభాస్ రాముడిగా నటించిన ఆది పురుష్ సినిమా నిలిచింది.

Also Read:  Adipurush: థియేటర్లో ఆదిపురుష్ సినిమా చూసేప్పుడు పాటించాల్సిన నియమాలివేనట.. వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్!

ఈ సినిమా 240 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక ఆ తర్వాత స్థానం కూడా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమానే దక్కించుకోవడం గమనార్హం. ఈ సినిమా 202 కోట్ల 80 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సహా అమితాబచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా 187 కోట్ల పాతిక లక్షల బిజినెస్ జరుపుకుంది. ఆ తర్వాత స్థానంలో పుష్ప మొదటి భాగం నిలిచింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా 134 కోట్ల 90 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా 131 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అదే విధంగా మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ సినిమా 124 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా 123 కోట్ల 60 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

నోట్: ఈ సమాచారం ఇంటర్నెట్లో వివిధ సోర్స్ ల నుండి సేకరించింది. ఈ సమాచారాన్ని ఎన్టీవీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.

Show comments