Site icon NTV Telugu

Tollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాల‌కు ద‌ర్శక‌త్వం వ‌హించారు. ‘డియర్’ అనే న‌వ‌ల ఆధారంగా ‘చాద‌స్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి శ‌ర‌త్ ప‌రిచ‌యం అయ్యారు. బాల‌కృష్ణ, సుమ‌న్‌ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి భారీ విజ‌యాలు సాధించారు. ఏఎన్నార్‌తో ‘కాలేజీ బుల్లోడు’, జ‌గ‌ప‌తిబాబుతో ‘భ‌లే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, సుమన్‌తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, చిన్నల్లుడు వంటి చిత్రాలకు శరత్ దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు శరత్ పెళ్లి చేసుకోలేదు.

director sarath
https://ntvtelugu.com/chiranjeevi-enjoyed-shooting-with-director-sukumar/
Exit mobile version