Tollywood Producers over movie re releases: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ హవా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే కాదు బోల్తా కొట్టిన సినిమాలు కూడా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. గతంలో ‘రీళ్ల’లో థియేటర్లకు వచ్చి సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు 4k టెక్నాలజీతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా లేదా ఆయా సినిమాలు రిలీజ్ అయి వార్షికోత్సవం జరుపుకుంటున్న క్రమంలో సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈతరం సినీ ప్రియులను కూడా అప్పటి తరంలోకి తీసుకెళ్తున్నారు.
Vishnu Priya : సమ్మోహనుడా సాంగ్ కు హాట్ స్టెప్స్ తో ఆకట్టుకున్న విష్ణు ప్రియ..
ఇప్పుడు ఇండియాలో ఈ ట్రెండ్‌ను సెట్ చేసింది టాలీవుడ్ మాత్రమే, అయితే గతంలో సినిమాలను ‘రీళ్ల’ ద్వారా మాత్రమే షూట్ చేసేవారు ఎందుకంటే అప్పట్లో డిజిటల్ కెమెరాలు లేవు. ఇక అప్పటి రీల్స్ ను ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ ఉన్న థియేటర్లలో ప్రదర్శించటం వీలు కాదు. కాబట్టి ఆ రీళ్లను ఇప్పటి సాంకేతికతకు తగ్గట్టు మార్చాలి అంటే ప్రతి ఫ్రేమ్‌ను స్కాన్ చేసి 4k విజువల్స్‌లోకి తీసుకొస్తేనే రీ రిలీజ్‌కు అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చేసేందుకు గాను సుమారుగా 3 నెలల వరకు పట్టచ్చు. ఆ ప్రాసెస్ లో స్కానింగ్, గ్రేడింగ్, రీస్టోరేషన్ అనే మూడు పద్ధతులను అనుసరించి 4k విజువల్స్‌లోకి మారుస్తారని అంటున్నారు.
అలా ఒక సినిమాను రీరిలీజ్ చేయడం మంచి లాభదాయకం అని చెబుతున్నా ఒక సినిమా రిజల్యూషన్‌ను 4కేలో మార్చడానికి దాదాపు రూ.10 లక్షల దాకా ఖర్చు అవుతుందని పలువురు సినీ ట్రేడర్స్ పేర్కొన్నారు. ఒరిజినల్ ప్రింట్‌ను తక్కువ ధరకే పొందగలిగితే, రీరిలీజ్ పక్కాగా మంచి లభాదయకమైన బిజినెస్ అని అంటున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పాత తరం నిర్మాతలు కొందరు బాధ పడుతున్నారు. అదేమంటే అప్పట్లో ఈ రీల్స్ ను లైట్ తీసుకుని, తమ తమ ఆఫీసుల్లో గోడౌన్లలో ఎక్కడెక్కడో పెట్టేశారు. ఇప్పుడు వాటిని వెతకితే వాటిలో కొన్ని పనికిరాని విధముగా మారాయని అంటున్నారు. అలా అప్పుడు లైట్ తీసుకుని ఇప్పుడేమో లబోదిబో మంటున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.