సోషల్ మీడియాని కబ్జా చేసారు ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఈ ఇద్దరు మాస్ హీరోల ఫాన్స్ ట్విట్టర్ ని హ్యాండోవర్ చేసుకొని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎవరూ తగ్గకుండా పోటా పోటీగా ట్వీట్స్ వేస్తూ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 4 టాగ్స్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లకి సంబంధించినవే ఉన్నాయి అంటే ఫాన్స్ చేస్తున్న హంగామా ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముందుగా మే 19న ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం అంటూ ‘ఎన్టీఆర్ 30’ మేకర్స్ అనౌన్స్ చెయ్యడంతో ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో గత వారం నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ జోష్ లో ఉన్నారు. ఈ జోష్ ని మరింత పెంచుతూ సింహాద్రి రీరిలీజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ అండ్ ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ ల దెబ్బకి ఎన్టీఆర్ ఫాన్స్ నెవర్ బిఫోర్ జోష్ లోకి వచ్చారు. దీంతో #NTR #JrNTR #NTR30 #Simhadri4K టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఫాన్స్ విషయానికి వస్తే… PKSDT టైటిల్ అనౌన్స్మెంట్, OG సెకండ్ షెడ్యూల్ అప్డేట్ లు బయటకి రావడంతో పవన్ ఫాన్స్ జోష్ లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు కలిసి చేసిన PKSDT సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈరోజు రానుంది. ఈ టైటిల్ బయటకి వచ్చేస్తే ఫాన్స్ హంగామా మరింత పెరిగే ఛాన్స్ ఉంది. OG సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యిందని డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రెండు కారణాల వలన #TheyCallHimOG #PKSDT #PawanKalyan టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇలా పవన్ ఫాన్స్ అండ్ ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.