Site icon NTV Telugu

Tollywood: ఈ వారం థియేట్రికల్ మూవీస్ ఇవే!

Happy Birthdaty

Happy Birthdaty

 

టాలీవుడ్ లో చిన్న చిత్రాల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ వీకెండ్ లో అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా ఎనిమిది సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. జూన్ 7వ తేదీ హాలీవుడ్ మూవీ ‘థోర్ లవ్ అండ్ థండర్’ గ్రాండ్ వే లో రిలీజ్ అవుతోంది. అలానే గత నెలలో తమిళంలో విడుదలైన సత్యరాజ్ తనయుడు శిబి రాజ్ నటించిన ‘మయోన్’ తెలుగు డబ్బింగ్ మూవీ కూడా గురువారమే జనం ముందుకు వస్తోంది.

శుక్రవారం ఆరు సినిమాలు థియేటర్లలలో సందడి చేయబోతున్నాయి. అందులో చెప్పుకోదగ్గ మొదటి చిత్రం లావణ్య త్రిపాఠి నటించిన ‘హ్యాపీ బర్త్ డే’. క్లాప్ ఎంటర్ టైన్ మెంట్, మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ‘మత్తు వదలారా’ ఫేమ్ రితేశ్ రాణా డైరెక్ట్ చేశాడు. సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. అలానే తొలిసారి మెగా ఫోన్ పట్టిన అఫ్సర్ రూపొందించిన ‘గంధర్వ’ చిత్రమూ శుక్రవారమే విడుదల అవుతోంది. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీలో సందీప్ మాధవ్ హీరోగా నటించాడు. అవార్డ్ విన్నింగ్ మూవీస్ ను తెరకెక్కించిన సునీల్ కుమార్ రెడ్డి తాజా చిత్రం ‘మా నాన్న నక్సలైట్’ సైతం ప్రై డే వస్తోంది. రఘు కుంచే కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ కు ప్రాధాన్యమిచ్చినట్టు సునీల్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఈ సినిమాను అనురాధ ఫిలిమ్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించారు. ఈ సినిమాతో పాటే ‘కొండవీడు’, ‘రుద్రసింహా’ చిత్రాలు వస్తున్నాయి. ఇక మలయాళ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘కడువా’ సినిమా గురువారం మలయాళ భాషలో వస్తుండగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 8వ తేదీ రిలీజ్ అవుతోంది. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కీలక పాత్ర పోషించాడు. మరి ఈ ఎనిమిది సినిమాలలో ప్రేక్షకులు వేటివైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Exit mobile version