NTV Telugu Site icon

Telugu Movie Updates: రేపు మూడు క్రేజీ ప్రాజెక్టుల నుంచి అప్డేట్స్.. డోంట్ మిస్

Tollywood Updates Tomorrow

Tollywood Updates Tomorrow

Tollywood Movie Updates: రేపు అంటే జూలై 3న టాలీవుడ్లో మూడు ఇంట్రెస్టింగ్ సినిమాల నుంచి అప్డేట్స్ రానున్నాయి. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ సినిమా అనౌన్స్ మెంట్ రానుంది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కెరీర్ లో ‘జులాయి’ ఒక మంచి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో తరువాత మరో రెండు సినిమాలు చేసి మూడు సార్లూ హిట్ కొట్టారు. సన్నాఫ్ సత్యమూర్తి, ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో మంచి హిట్ కొట్టారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో నాలుగో సినిమాకి సర్వం సిద్దమవుతోంది. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ జులై 3న ఉదయం 10: 08 నిముషాలకి అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. ఇక మరోపక్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా రిలీజ్ డేట్​ను ఫిక్స్ చేయగా అనౌన్స్ మెంట్ కూడా రేపు చేయబోతున్నారు. మధ్యాహ్నం 1.35 నిముషాలకి ఈ అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు.

Payal Rajput: వాళ్లు తప్పుదోవ పట్టించి, వాడుకున్నారు.. పాయల్ సంచలన వ్యాఖ్యలు

ఆగస్టు 4న మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరో పాక అఖండతో వంటి బంపర్ హిట్‌ తర్వాత బోయపాటి రామ్‌తో ఓ యాక్షన్‌ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేసుకుంటున్న క్రమంలో ఒక బిగ్ అప్‌డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా టైటిల్‌ను సోమవారం రివీల్‌ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. టైటిల్‌తో పాటు ఓ మాస్‌ గ్లింప్స్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నారు. ఉదయం 11.25కి ఈ అప్డేట్ రానున్నది. ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. అవుట్‌ అండ్‌ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుండగా శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.