తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఒక్క హిట్ లేని టాలీవుడ్ నాలుగు నెలల పాటు వెంటిలేటర్ మీద ఉంది. జూన్ నుంచి నెలకొక హిట్‌తో ఊపిరి పీల్చుకుంటుంది. ఈ నెలలో బాక్సాఫీస్‌కు లాభాలు తీసుకొచ్చిన సినిమా ఏంటి? వాచ్ దిస్. 2026 ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త బెటర్‌గా ఉన్నా, రెగ్యులర్‌గా వచ్చే 10% సక్సెస్‌కు ఇంకా టాలీవుడ్ చేరుకోలేదు. జూలైలో క్రేజీ మూవీస్ ఒక్కటి రాలేదు. పెద్ద హీరోలు ఎవ్వరూ కనిపించలేదు. థియేటర్స్ కావలసినన్ని దొరికినా, చాలా సినిమాలు ఆడియన్స్‌ను తీసుకురాలేకపోయాయి. ‘నాగబంధం’ భారీ యాక్షన్, విఎఫ్‌ఎక్స్ మూవీగా రూపొందింది. టీజర్, ట్రైలర్లు, గ్రాఫిక్ వర్క్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూడాలన్న ఆసక్తిపై ‘నాగబంధం’ కథ నీళ్లు చల్లింది. అసలు కథే లేకుండా విఎఫ్‌ఎక్స్‌ని నమ్ముకొని సినిమా తీస్తే ఎలా ఉంటుందో దానికి ఎగ్జాంపుల్‌గా ‘నాగబంధం’ నిలిచింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 28 కోట్లకు అమ్ముడైతే 10 కోట్లు మాత్రమే వచ్చింది. సత్యదేవ్ డిఫరెంట్ గెటప్స్‌తో కనిపించిన సినిమా ‘రావు బహదూర్’. మరో ‘బాహుబలి’ అవుతుందని హీరో ఎంతో నమ్మకంతో ఉంటే, కథ అడ్డం తిరిగింది. దర్శకుడు వెంకటేష్ మహా కథను సాగదీయడంతో ఆడియన్స్ బోర్ ఫీల్ అయి రిజెక్ట్ చేశారు. సినిమాను 8.50 కోట్ల రూపాయలకు అమ్మితే ఆరున్నరే వచ్చింది.
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు తెరపైకి వచ్చాడు. ఘట్టమనేని రమేష్ కొడుకు జై కృష్ణ శ్రీనివాస్ ‘మంగాపురం’తో హీరోగా పరిచయమయ్యాడు. దర్శకుడు అజయ్ భూపతి రొటీన్ లవ్ స్టోరీగా తీయడం సినిమాకు మైనస్ అయింది. జులై నెలలో వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’ డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలు తీసుకొచ్చింది. ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ అందించిన కథలో ఫీల్ చెడకుండా రవి డైరెక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ కాస్త బోర్ కొట్టినా, హీరోయిన్ గౌరీ ప్రియ తన పెర్ఫార్మెన్స్‌తో కవర్ చేసేసింది. సినిమాను 13 కోట్లకు అమ్మితే వారం రోజుల్లో 21 కోట్ల రూపాయలు వచ్చింది. లాంగ్ రన్‌లో 30 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ హాఫ్‌లో క్రమంగా కోలుకుంటున్న తెలుగు సినిమా ఆగస్టుపై చాలా ఆశలు పెట్టుకుంది. వారానికో క్రేజీ మూవీ థియేటర్స్‌లోకి రావడంతో, ఈ నెలలో అయినా ఒకటి కాదు రెండు, మూడు సక్సెస్‌లు వస్తాయన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. ఈ నెలలో వస్తున్న ఆ క్రేజీ మూవీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
ఆగస్ట్ 7న వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’గా వస్తున్నాడు. వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న ఈ మెగా హీరో ఈసారి హర్రర్ కామెడీని నమ్ముకున్నాడు. గతంలో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి హిట్స్ తీసిన మేర్లపాక గాంధీ దర్శకుడు. ‘మిరాయి’ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్. ఆగస్ట్ 7నే ‘కొరియన్ కనకరాజు’తో పాటు డబ్బింగ్ మూవీ ‘డీసీ’ రిలీజ్ అవుతుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటిస్తున్న ఈ తమిళ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌గా రూపొందింది. ఇక 14న సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ అవుతుంది. ‘వీరభద్రుడు’తో ఫామ్‌లోకి వచ్చిన సూర్య ఈసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ తీసిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకుడు కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా లవర్స్‌కు ఆగస్టులో ప్రతి ఫ్రైడే పండుగే! 21న రవితేజతో సినిమా వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. తండ్రి కూతుర్ల కథతో రూపొందించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. నెలాఖరులో 26న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ రిలీజ్ అవుతుంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకున్న యష్ ఈసారి రొమాంటిక్ యాక్షన్ మూవీని సెలెక్ట్ చేసుకున్నాడు. మరి ఆగస్టులో రిలీజ్ అవుతున్న ఈ క్రేజీ మూవీస్‌లో ఎన్ని బాక్సాఫీస్‌ను మెప్పిస్తాయో చూడాలి మరి.

