Site icon NTV Telugu

Rajamouli : జక్కన్న మొదలెడితే.. స్టార్ హీరోలు ఫాలో అవుతున్నారే..

Telugu Star Heros

Telugu Star Heros

Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా కొత్త ప్రయోగం చేసి సక్సెస్ సాధిస్తే.. మిగతా వారు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెస్. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం అనే ట్రెండ్ జక్కన్న స్టార్ట్ చేశాడు. పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్ ఉంటే బెటర్ అన్న ట్రెండ్ ను జక్కన్న మొదలు పెట్టాడు. హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ హీరోయిన్లకు జై కొట్టడంతో.. మిగతా స్టార్ హీరోలు అందరూ అదే ఫాలో అవుతున్నారు.

Read Also : Sreenu Vaitla : సినిమా డబ్బులతో భూములు కొన్నా.. శ్రీనువైట్ల కామెంట్స్..

త్రిబుల్ ఆర్ మూవీకి ఆలియా భట్ ను తీసుకున్నాడు జక్కన్న. ఆమె వల్ల హిందీలో ఈజీగా సినిమా గురించి అందరికీ తెలిసిపోయింది. జక్కన్న మూవీ అంటే బాహుబలితోనే దేశమంతా తెలిసిపోయినా.. తీసే ప్రతి సినిమాకు ప్రమోషన్ అవసరమే. అందుకే ఆలియాను తీసుకున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాకు ప్రియాంకచొప్రాను తీసుకున్నాడు. అప్పటి నుంచి స్టార్ హీరోలు బాలీవుడ్ భామలకే ఓటేస్తున్నారు.

రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్ లో కియారాను, ఇప్పుడు పెద్ది మూవీకి జాన్వీకపూర్ ను తీసుకున్నాడు. ఎన్టీఆర్ దేవర మూవీకి జాన్వీకపూర్ ను తీసుకుంటే.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీకి రుక్మిణిని తీసుకున్నాడు. ప్రభాస్ సాహో కోసం శ్రద్దా కపూర్ ను, ఆదిపురుష్ కోసం కృతిసనన్, కల్కి కోసం దీపిక, స్పిరిట్ కోసం త్రిప్తిని తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ కూడా అట్లీతో చేయబోయే మూవీకి దీపిక పదుకొణెను తీసుకున్నాడు. ఇలా స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమా అంటే చాలు బాలీవుడ్ భామలకే ఓటేస్తున్నారు.

Read Also : Kannappa : కన్నప్ప.. ఆ నలుగురు ఎక్కడప్పా..?

Exit mobile version