NTV Telugu Site icon

Tollywood: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందుకున్న టాలీవుడ్ హీరోలు..

February 7 2025 02 17t110753.987

February 7 2025 02 17t110753.987

ముక్కంటి ఆలయంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. కానుక ఎంతో ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన కాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను చేతబట్టుకుని ప్రముఖులను ఆహ్వానించాడు.

Also Read:Producer SKN: తెలుగు హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ కామెంట్స్ వైరల్..

ఈ క్రమంలో తదితర కీలక రాజకీయ నేతలను కలిసిన సుధీర్ రెడ్డి ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లతో పాటుగా తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ను ఈ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం పలికారు. ఇందులో తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా ఉన్నారు. ఇక వీరితో పాటుగా తెలుగు హీరోలునందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, నితిన్, వంటి స్టార్ హీరోలను కూడా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.