స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఊరమాస్ లుక్‌లోకి రావాల్సిందే. ఇలా రస్ట్ అండ్ రగ్డ్‌లుక్‌లోకి వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఇలా మారిన వారికే హిట్స్ పడేసరికి అందరూ ఇదే బాటపట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎన్నిసార్లయినా రఫ్‌గా తయారవడానికి రెడీ అంటున్నారు. లుక్‌తో అందరి దృష్టి తమపై తిప్పుకుంటున్నారు హీరోలు.
Also Read : LittleHearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీకి వచ్చేసిందిగా.. ఎక్కడంటే?
ప్రశాంత్‌నీల్ మూవీ కోసం లుక్ మార్చేశాడు తారక్. మొదటి రెండు షెడ్యూల్లో బక్కగా కనిపించినా లైట్ బియర్డ్‌తో నటిస్తే అక్టోబర్‌లో జరిగే షెడ్యూల్ కోసం లుక్ మార్చేశాడు. గుబురు గడ్డంతో ఎంట్రీ ఇస్తున్నాడు. కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ రావడంతో ప్రశాంత్ నీల్ సినిమా లుక్ బైటకొచ్చేసింది. అక్కినేని హీరోలు చాలా క్లాస్‌గా వుంటారు. వీళ్లకు అలాంటి రోల్సే వస్తాయి. లవర్‌బాయ్స్‌గా కనిపిస్తూ లవ్‌స్టోరీస్ ఎన్ని చేసినా సక్సెస్ దక్కకపోవడంతో ఈ క్లాస్ హీరోలు కాస్తా ఊరమాస్‌గా మారిపోయారు. ఇంతవరకు సరైన హిట్ లేని అఖిల్ కూడా గుబురు గడ్డంతో ఏడాది నుంచి కనిపిస్తున్నాడు. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత నటిస్తున్న ‘లెనిన్’ మూవీ కోసం గుబురు గడ్డంతో ఊరమాస్ లుక్‌లోకి వచ్చేశాడు అఖిల్. గెటప్ మార్చనిదే కష్టపడనిదే సక్సెస్ దక్కదు. దీంతో రియలిస్టిక్ కథను ఎంచుకున్న చైతు జాలరిగా మారిపోయి.. స్టైలిష్ లుక్ నుంచి రఫ్ లుక్‌లోకి రావడమే కాదు.. ఏడాదికి పైగా ఇదే లుక్ మెయిన్‌టేన్ చేసి హిట్ కొట్టాడు. చూస్తుంటే గెటప్ ఛేంజ్ కెరీర్‌కు గేమ్ ఛేంజర్ అవుతోంది. బ్రో ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకున్న సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’లో గుర్తుపట్టలేనంతగా గడ్డం పెంచేశాడు. కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు సాయి దుర్గ తేజ్.
