Tollywood Heros : టలీవుడ్ హీరోలు కేవలం సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లో కూడా బాగానే సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఇందులో ముందుగా చెప్పాల్సింది హీరో నాగార్జున గురించి. ఆయనకు హైదరాబాద్ లో ఎన్ గ్రిల్ (N Grill), ఎన్ ఏషియన్ (N Asian) రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ANV రెస్టారెంట్లు స్థాపించాడు. ఇందులో లగ్జరీ డైనింగ్ వాతావరణం ఉంటుంది. ఫ్యాన్స్‌తో పాటు ఫుడ్ లవర్స్‌ను కూడా ఆకర్షించేలా మహేశ్ రెస్టారెంట్లు ఉంటాయి.
Read Also : Nidhi Agarwal : 8 ప్లాపులు.. నిధి అగర్వాల్ కు ప్రభాస్ ఒక్కడే దిక్కు..
ప్రస్తుతం బన్నీ ‘బీ డెక్కన్ బిర్యానీస్’ అనే రెస్టారెంట్ చైన్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇవి హైదరాబాద్ లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఇక హీరో రానా రెండు ఫుడ్ బ్రాండ్ లను నడుపుతున్నాడు. అందులో ఒకటి బ్రాడ్‌వే, ఇంకొకటి శాంచురీ. శాంచురీ రెస్టారెంట్‌ను తమకు చెందిన ఇంట్లోనే స్థాపించాడు. రానా రెస్టారెంట్లు నేచర్ కు దగ్గరగా కనిపిస్తాయి. యంగ్ హీరో నాగ చైతన్య కూడా ‘పాన్-ఏషియన్ క్విజిన్’ రెస్టారెంట్లను స్థాపించాడు. వీళ్లు ఇలా సినిమాలతో పాటు రెస్టారెంట్లతోనూ బాగానే సంపాదిస్తున్నారు.
Read Also : SSMB 29 : చడీచప్పుడు లేకుండా పోస్టర్లు.. రాజమౌళి ఏం చేస్తున్నావ్..?
