Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషశెట్టితో ఈరోజు నాగశౌర్య వివాహం జరగనుంది. ఈ రోజు ఉదయం 11.25 గంటలకు పెళ్లి ముహూర్తంగా వేదపండితులు నిర్ణయించారు. వీరి వివాహ వేడుకకు బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వేదిక కానుంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నాగశౌర్య వివాహానికి హాజరుకానున్నారు. అటు శనివారం హల్దీ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. అనంతరం కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో తనకు కాబోయే సతీమణికి నాగశౌర్య ఉంగరం తొడిగాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Bigg Boss 6: హోస్ట్ నాగార్జునపై నెటిజన్‌ల ఫైర్.. ఆదిరెడ్డి తప్పేంటని ప్రశ్న
కాగా నాగశౌర్యకు కాబోయే భార్య అనూష శెట్టి స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందపూర్ గ్రామం. ఇంటీరియర్ డిజైనర్‌గా ఆమె కెరీర్ మొదలుపెట్టింది. అనూష డిజైన్స్ పేరుతో సొంత కంపెనీ కూడా నిర్వహిస్తోంది. 2019లో ఆమె స్థాపించబడ్డ అనూష డిజైన్స్ సంస్థకు చాలా అవార్డులు కూడా వచ్చాయి. డిజైనర్ ఆఫ్ ది ఇయర్-2019, 40 అండర్ 40 బెస్ట్ ఇంటరీయర్ డిజైనర్ ఇన్ ది కంట్రీ -2020, మోస్ట్ ఇన్నోవేటివ్ లగ్జరీ ఇంటరీయర్ డిజైనర్ 2020, ఇండియా టాప్ 10 ఇంటీరియర్ డిజైనర్స్-2021 అవార్డుతో పాటు అనూష పలు పురస్కారాలు అందుకుంది.