Site icon NTV Telugu

బ్రేకింగ్: దాసరి నారాయణరావు కొడుకు అరుణ్ అరెస్ట్..

dasari arun

dasari arun

తెలుగు చిత్ర పరిశ్రమను ఒక స్థాయిలో నిలబెట్టిన దర్శకుల్లో దాసరి నారాయణరావు ఒకరు. ఇండస్ట్రీకి ఆయన చేసి సేవలు అలాంటివి.. అయితే ఆయన సంపాదించుకున్న అంత గొప్ప పేరును ఆయన కొడుకులే తుడిచేయడం కడు బాధాకరం. దాసరి కొడుకులు.. ఆయన చనిపోయాక ఆస్తి గొడవలతో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దాసరి చిన్న కొడుకు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటాడు. మొన్నామధ్య స్థలం గొడవలో ఒకరిని చంపేస్తానని బెదిరించిన వివాదం నుంచి తేరుకోకముందే మరో వివాదంలో అరుణ్ చిక్కుకున్నాడు.

గురువారం తెల్లవారుజామున తప్పతాగి.. కారు డ్రైవ్ చేసి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెండు బైక్ లను ఢీకోట్టినట్లు తెలుస్తోంది. అప్పటికే అరుణ్ మద్యం తాగి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ చేయగా 405 సూచించిందని, వెంటనే ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరుణ్ పై కేసు నమోదు చేసి.. సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే దాసరి అరుణ్ హీరోగా పలు సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే.

Exit mobile version