Site icon NTV Telugu

Dharmendra : ధర్మేంద్ర మృతిపై టాలీవుడ్ హీరోల సంతాపం

Dharmendra News

Dharmendra News

Dharmendra : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కొన్ని గంటల క్రితమే మృతిచెందారు. దీంతో ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ ఏలిన ధర్మేంద్ర.. 300 వందలకు పైగా సినిమాల్లో నటించాడు. ఇక ధర్మేంద్ర మృతిపై ఇటు టాలీవుడ్ హీరోలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ట్వీట్ చేసి ఎమోషనల్ అయ్యారు.

‘ధర్మేంద్ర కేవలం దగ్గజ నటుడు మాత్రమే కాదు. ఒక అద్భుతమైన వ్యక్తి కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారి ఆయన వ్యక్తిత్వం నా హృదయాన్ని లోతుగా తాకింది. ఆయనతో నేను పంచుకున్న స్నేహ పూర్వక విషయాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన మన మధ్య లేనందుకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి, ముఖ్యంగా నా స్నేహితులు సన్నీ డియోల్, బాబీ డియోల్ కు సంతాపం తెలియజేస్తున్నా. ఆయన లక్షలాది మంది హృదయాలలో బతికే ఉంటారు అన్నారు చిరంజీవి.

Read Also : Vijay Devarakonda : చిన్న హీరోలకు అండగా విజయ్ దేవరకొండ

అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ధర్మేంద్ర మరణ వార్త నన్ను కలిచివేసింది. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన భారతీయ సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి’ అన్నారు జూనియర్ ఎన్టీఆర్ వీరే కాకుండా మరింత మంది హీరోలు, డైరెక్టర్లు కూడా సంతాపం తెలుపుతున్నారు.

Read Also : Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి.. వెంటాడుతున్న నేటివిటీ ప్రాబ్లమ్

Exit mobile version