NTV Telugu Site icon

Tollywood Rewind 2023: తారకరత్న, చంద్రమోహన్ సహా 2023లో కన్నుమూసిన తెలుగు సినీ ప్రముఖులు వీరే

Tollywood Dead Celebrities 2023

Tollywood Dead Celebrities 2023

Tollywood Rewind 2023: Tollywood Celebrities Who Died in 2023: 2023లో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చాలా నష్టం జరిగింది. తారకరత్న చంద్రమోహన్, కె.విశ్వనాథ్, శరత్ బాబు సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కనుమూశారు. 2023 చివరికి వచ్చేసిన క్రమంలో ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన వారి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను.

చంద్రమోహన్: ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో హృదయ రోగంతో బాధపడుతూ ఆయన కన్నుమూశారు

శరత్ బాబు : ఈ ఏడాది మే 22న తెలుగు సహా దక్షిణాది భాషల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్న శరత్ బాబు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసారు. శరత్ బాబు మృతిపై తెలుగు సహా దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

‘రే స్టీవేన్‌సన్’: ఈ ఏడాది మే 22న RRR సినిమాలో బ్రిటీష్‌ పాలకుడి పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్‌ అనారోగ్యంతో కన్నుమూశారు, చనిపోయే నాటికీ ఆయన వయసు 58 ఏళ్లు.

సంగీత దర్శకుడు రాజ్ : ఈ ఏడాది మే 21న ‘రాజ్ – కోటి’ ద్వయంలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు.  

మనో బాల: ఈ ఏడాది మే 3న తమిళంలో పాటు తెలుగులో తన కామెడీతో ఆకట్టుకున్న మనోబాల మే 3న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.  

సతీష్ కౌశిక్: ఈ ఏడాది మార్చి 9న ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 

మయిల్‌సామి: ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రముఖ తమిళ హాస్యనటుడు మయిల్ సామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన దాదాపు 300 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించారు.  

తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరి 18న నందమూరి మూడో తరం నట వారసుడు తారకతర్న నారా లోకేష్ యువగళం పాత్ర ప్రారంభమైన క్రమంలో పాల్గొని కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శివైక్యం చెందాడు. 

కే.విశ్వనాథ్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆయన వయసు 92 ఏళ్లు.  

 దర్శకుడు సాగర్ ఈ ఏడాది ఫిబ్రవరి 2మా అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూశారు.  రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, వంటి సినిమాలను తీశారు. 

జమున  ఈ ఏడాది జనవరి 27న  జమున  వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు తెర సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఆమె. 

బాల మురుగన్ ఈ ఏడాది జనవరి 16న అనారోగ్యంతో కన్నుమూశారు. ముఖ తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి, పాపులర్‌ రైటర్ బాలమురుగన్‌ తెలుగు, తమిళంలో పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు.