ఎట్టకేలకు సీఎం జగన్ తో టాలీవుడ్ బృందం భేటీ ముగిసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ పరిశ్రమ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టుగా కన్పిస్తోంది. తాజాగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని, నిర్మాత నిరంజన్ రెడ్డి లాంటి పలువురు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినీ పెద్దలంతా కలిసి సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా సీఎం జగన్ కు సినీ పరిశ్రమ నుంచి 14 విజ్ఞప్తులు చేసినట్టు తెలుస్తోంది. అవేంటంటే…
Read Also : Mahesh Marriage Anniversary : ఒకే ఫ్రేమ్ లో బడా స్టార్స్… పిక్ తో ఫ్యాన్స్ కి ట్రీట్
- ఆమోదయోగ్యమైన టికెట్ ధరలు
- టికెట్ విక్రయాల్లో పారదర్శకత
- ప్రభుత్వ ప్రదేశాల్లో అద్దె లేకుండా సినిమా షూటింగులు
- తక్కువ బడ్జెట్ చిత్రాలకు 5 షోలు
- ఏడాదిలో 15 వారాలు చిన్న సినిమాల ప్రదర్శన
- చిన్న చిన్న షరతులతో మినీ థియేటర్లకు అనుమతి
- టాలీవుడ్ కు పరిశ్రమ హోదా
- ఆన్లైన్ టిక్కెటింగ్ మరియు టికెట్ విక్రయాల్లో పారదర్శకత
- పేద నిర్మాతలకు పెన్షన్
- సినిమాల వల్ల భారీగా నష్టపోయిన నిర్మాతలకు ఆర్ధిక సాయం
- ఎంపిక చేసిన తెలుగు సినిమాలకు నంది అవార్డులు
- నిర్మాతలు, దర్శకులు, కళాకారుల ఇళ్ల నిర్మాణం కోసం భూముల కేటాయింపు
- షూటింగుల్లో పని చేసే కార్మికులకు నిర్మాతలు కార్మిక చట్టాలను అమలు చేయాలి
- స్టూడియోల నిర్మాణాలకు భూముల కేటాయింపు
