విమలా రామన్.. మోడల్ గా కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే హీరోయిన్ గా మారింది. ‘గాయం-2’, ‘చట్టం’, ‘ఎవరైనా.. ఎపుడైనా’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన విమలా.. మలయాళంలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. తెలుగు సోల్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన వాన సినిమాను ఏ ఒక్కరు అంత త్వరగా మర్చిపోలేరు.
ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన వినయ్ రాయ్ ప్రస్తుతం కోలీవుడ్ లో విలన్ గా సెటిల్ అయిన సంగతి తెలిసిందే. డిటెక్టివ్, డాక్టర్, ఈటీ లాంటి చిత్రాల్లో హీరోలకు ధీటుగా కనిపించి మెప్పించిన వినయ్ తో విమలా రామన్ వివాహం జరగనున్నదట . గత కొన్నేళ్లుగా ఈ జంట డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇక అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవలే విమలా తన ఇన్స్టాగ్రామ్ లో వినయ్ తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది. త్వరలోనే వీరి వివాహ విషయం గురించి అధికారికంగా తెలపనున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఈ జంట నోరు విప్పేవరకు ఆగాల్సిందే.
