మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలకు బంగారం సమర్పించడం ఒక ఆనవాయితీ అనే సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో తమ పెంపుడు కుక్కను తక్కెడలో కూర్చోబెట్టి ఒక వివాదానికి కారణమైంది టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య. అయితే కొంతమంది మొక్కు ప్రకారం అలా కుక్కను కూర్చోబెట్టడం తప్పు లేదంటే, మరికొంతమంది మాత్రం “అలా ఎలా చేస్తావు? దేవతలను అవమానించడమే” అంటూ కామెంట్స్ చేశారు.
Also Read:Mana Shankara Vara Prasad Garu: స్కేల్, హైప్ అవసరమేలే.. కంటెంట్ బలంతోనే ఎంఎస్‌జీ ఇండస్ట్రీ హిట్!
అయితే ఈ విషయం మీద తాజాగా ఆమె స్పందించింది. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. “అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి, అలాగే క్షమాపణ చెప్పడానికి చేస్తున్నాను. మేము పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది, అది కరెక్ట్ కాదు అని. మేం పెంచుకునే కుక్కకి 12 ఏళ్లు, దానికి ట్యూమర్ సర్జరీ జరిగింది. అది రికవరీ అవ్వాలని నేను ఆ అమ్మవారిని మొక్కుకున్నాను. రికవరీ అయింది, నడుస్తోంది. మొక్కు చెల్లించాలని మా డాగ్ ని బంగారం తూకం వేయడం జరిగింది. కాబట్టి నేను అది ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. ఇంకా వేరే ఏమీ ఉద్దేశించి, ఎవరిని కించపరచాలని చేయలేదు.
Also Read:Ayodhya: అయోధ్య రాముడి కోసం బంగారు ధనుస్సు సిద్ధం
మన మేడారం జాతర సంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం తప్పని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. కాబట్టి నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అలాగే ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగవు, అలాంటి తప్పు మళ్ళీ చేయను. మన సంప్రదాయాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్ గా కోరుతున్నాను” అంటూ వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.