Hero Dharma : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మపై భార్య గౌతమి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భర్త ధర్మపై వరకట్న వేధింపుల కేసులు కూడా పెట్టిన గౌతమి.. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుత సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ, మా మావయ్య, ఆడపడుచు నన్ను రోజూ టార్చర్ చేస్తున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నారు. నా కొడుకును కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. ఆ పసివాడు ఏం చేశాడు. నా కొడుకు మీద ఎందుకు కక్ష. మా భర్తకు అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. బిగ్ బాస్ ఆర్టిస్టులు తరచూ అతని ఫ్లాట్ కు వస్తుంటారు. వారందరి గురించి నేను అడిగితే నన్ను టార్చర్ చేస్తున్నాడు. తిరిగి నా మీదనే అఫైర్లు అంటగడుతున్నాడు అంటూ వాపోయింది.
Read Also : Megastar Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా..?
నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే నన్ను చంపాలని చూశారు. వారి నుంచి తప్పించుకుని తిరిగాను. ప్రతిరోజూ నాకు ఫోన్ లు చేసి బెదిరిస్తున్నారు. రౌడీలతో నన్ను చంపించాలని చూస్తున్నారు. వాళ్ల గురించి నేను అడిగినందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు. వాళ్ల నుంచి నాకు ప్రాణహాని ఉంది. దయచేసి నన్ను కాపాడండి. నా బిడ్డను కూడా చంపేయాలని చూస్తున్నారు. నేను ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ను. నా కంటెంట్ ద్వారా వచ్చిన డబ్బులతోనే నేను బతుకుతున్నాను. ధర్మనే నా వెంట పడ్డాడు. అప్పటి వరకు అతను ఎవరో కూడా నాకు పెద్దగా తెలియదు. అతనే నన్ను పెళ్లి చేసుకుందామని అడిగాడు. ఇప్పుడు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు. కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయడం నేర్చుకో ధర్మ. వాడు మన కొడుకు. నీకు ఎందుకు ఇంత పగ, ప్రతీకారం అంటూ ఎమోషనల్ అయింది గౌతమి. గౌతమి, ధర్మకు 2019లో లవ్ మ్యారేజ్ జరిగింది. వీరికి రీసెంట్ గానే ఓ కొడుకు పుట్టాడు.
Read Also : Tollywood : చర్చలు సఫలం.. రేపటి నుంచి షూటింగులు ప్రారంభం